ఇండియా ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న ఐదు వన్ డేల సీరీస్ లో 4-1 తేడాతో ఇండియా సీరీస్ కైవసం చేసుకుంది. ఈరోజు జరిగిన ఐదో వన్ డేలో కూడా భారత్ సునాయస విజయం అందుకుంది. మ్యాచ్ విన్ అవడమే కాదు ఐసిసి వన్ డే ర్యాంకింగ్స్ లో నెంబర్ 1 స్థానం కూడా సంపాదించింది ఇండియా.


119 పాయింట్లతో సౌతాఫ్రిక మొదటిస్థానంలో ఉండగా ఐదో వన్ డే గెలుపుతో ఇండియా టాప్ లో నిలిచింది. ఇక జరిగిన 5వ వన్ డే విషయానికొస్తే మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి242 పరుగులు చేసింది. ఆసిస్ బ్యాటింగ్ లో ఓపెనర్లు వార్నర్ 53, ఫించ్ 32 కొట్టగా మిడిల్ ఆర్డర్ సహకారంతో ఆమోదయోగ్యమైన పరుగులు చేశారు.  


ఇక లక్ష్యం ఛేదించే దిశగా భారత్ ఓపెనర్లు రహనే 61, రోహిత్ శర్మ 125 పరుగులతో మ్యాచ్ ను డిసైడ్ చేశారు. విరాట్ కొహ్లి కూడా 39 పరుగులతో జట్టుకి విజయాన్ని అందించాడు. కేవలం 42.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 243 పరుగులు చేసింది ఇండియా. ఇక ఈ గెలుపుతో వన్ డే ర్యాంకింగ్ లో నెంబర్ 1లో నిలిచింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: