ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్ లో విరాట్ కొహ్లి మళ్లీ తన సత్తా చాటాడు. టెస్టు ర్యాంకింగ్ లో మొన్నటిదాకా 5వ ర్యాంక్ లో ఉన్న కొహ్లి ఇప్పుడు సెకండ్ ప్లేస్ కు చేరుకున్నాడు. శ్రీలంకతో జరిగిన మూడో టెస్టు ముందు దాకా 5వ ర్యాంక్ లో ఉన్న కొహ్లి మూడో టెస్టులో మొదటి ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీతో పాటుగా రెండో ఇన్నింగ్స్ లో హాఫ్ సెంచరీ చేయడంతో వెంటనే ఐసిసి ర్యాంకింగ్ లో టాప్ 2కి ఎగబ్రాకాడు.  


ప్రస్తుతం కొహ్లి 893 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక 938 పాయింట్లతో ఆస్ట్రేఇయా కెప్టెన్ స్టీవ్ స్మిత్ మొదటి స్థానంలో ఉన్నాడు. శ్రీలంక కెప్టెన్ చందిమాల్ మొదటిసారి ఐసిసి టాప్ 10 ర్యాంకింగ్స్ లో స్థానం సంపాదించుకున్నాడు. భారత్ లో జరిగిన టెస్టులో అతను చూపించిన ప్రతిభకు 743 పాయింట్లతో ఐసిసి టెస్టు ర్యాంక్ లలో 7వ స్థానంలో ఉన్నాడు. ఇక ఇండియా శ్రీలంకల మధ్య జరిగిన 3టెస్టుల సీరీస్ లో ఇండియా 1-0తో సీరీస్ సొంతం చేసుకుంది. ఇక వరుసగా 9 టెస్టు సీరీస్ లను గెలిచినా కెప్టెన్ గా కూడా విరాట్ కొహ్లి అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు.


వరుసగా 9 టెస్టులను గెలిచినా ఆస్ట్రేలియా రికార్డును సైతం సమం చేశారు. ప్రస్తుతం బౌలింగ్ బ్యాటింగ్ లో పటిష్టంగా కనిపిస్తున్న భారత జట్టు టెస్టుల్లో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతుంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: