ఎలాంటి వ్యవహారానికి సంబంధించిన వీడియో అయినా సరే యూ ట్యూబ్ ని నమ్ముకున్నాం మనం. సినిమాలు, టీవీ సీరియల్స్ , ఫన్ ప్రోగ్రాం లూ , కామేడీ , వంట వీడియో లు ఒకటి కాదు సర్వం మనం యూ ట్యూబ్ నుంచి నేర్చుకునేవే. యూ ట్యూబ్ లో రైమ్స్ చూపిస్తూ తల్లులు పిల్లలకి అన్నం పెడుతున్న రోజులు ఇవి. ఇంతగా యూ ట్యూబ్ ని వాడుతున్న మనకి దాంట్లో డైరెక్ట్ కీస్ కాకుండా బోల్డు షార్ట్ కీస్ ఉన్నాయి అని తెలుసా ? తెలీదు కాబట్టే ఈ ఆర్టికిల్. ఇంత తేలికగా యూ ట్యూబ్ ని ఉపయోగించచ్చా ? అని షాక్ ఇచ్చే ఈ షార్ట్ కీస్ ని మీరే చూడండి.

 

- మీరు ఒక వీడియో చూస్తున్నప్పుడు ఎదో పని పడి అర్జంట్ గా పాజ్ చెయ్యాలి అనుకోండి దాని కోసం మీరు ప్రత్యేకంగా మౌస్ నో , పాడ్ ని వెతుక్కోక్కర్లేదు. చేతిలో ఉన్న కీ బోర్డ్ లో స్పేస్ బార్ ఒక్కసారి నొక్కండి చాలు. లేదా 'కే' - K ఆల్ఫాబేట్ ని నొక్కినా సరిపోతుంది.

 

 

- వీడియో ప్లే అవుతున్న సమయం లో చూడాల్సింది ఏదైనా మిస్ అయ్యింది అనుకున్నా లేక ఐదు సెకండ్లు అంతకంటే ఎక్కువ వెనక్కి వెళ్లి చూడాల్సింది మళ్ళీ చూడాలి అన్నా కర్సర్ తో పని లేనే లేదు. లెఫ్ట్ యారో నో క్లిక్ చేస్తే సరిపోతుంది.

 

- మంచి వీడియో చూస్తున్నప్పుడు ఒక్క సారిగా పది , పదిహేను సెకన్ల ముందర ఏం జరిగిందో చూడాలి అనుకుంటాం.మీరు వెనక్కి 10 సెకండ్లు వెళ్లాలనుకుంటే j or Ctrl+Left arrow ప్రెస్ చేయండి

 

- ముందుకి ఐదు సెకన్ల వరకూ వెళ్ళడానికి రైట్ యారో పని చేస్తుంది

 

- ఐ బటన్ నొక్కి ctrl + right arrow నొక్కితే పది సెకన్ల వరకూ అలా ముందుకు వెళుతుంది

 

- ఫుల్ స్క్రీన్ కనపడాలి అంటే F ఆల్ఫాబేట్ ని నొక్కండి

 

- పుల్ స్క్రీన్ వద్దనుకుంటే F కాని లేకుంటే Escape బటన్ కాని ప్రెస్ చేయండి

 

- వీడియో లో కొంత భాగం కాకుండా మొదటి నుంచీ మిస్ అయ్యాం అని అనుకుంటే మొదటి నుంచీ చూడడం కొసం ' 0 ' ప్రెస్ చెయ్యండి

 

- హోం పేజీకోసం home బటన్ నొక్కండి

 

- వీడియో చివరాఖరికి వెళ్ళాలి అంటే END బటన్ నొక్కాలి


మరింత సమాచారం తెలుసుకోండి: