ట్విట్టర్ - మన దైనందిన జీవితం లో ఒక భాగం అయిపోయింది ఈ వెబ్సైటు. సామాజిక మాధ్యమాల్లో ఫేస్ బుక్ కీ రోల్ ప్ల్రే చేస్తూ పెద్దన్నగా ఉన్న టైం లో ఒచ్చిన ట్విట్టర్ అద్భుతంగా పుంజుకుంది. ముఖ్యంగా సేలెబ్రిటీలు అందరూ ఇందులోనే ఎకౌంటు క్రియేట్ చేసుకుని మరీ హడావిడి చెయ్యడం తో జనాలు కూడా వారికోసం ఇందులోకి రావడం మొదలు పెట్టారు. మొదట్లో సెలెబ్రిటీలకి మాత్రమే అడ్డగా ఉండేది ట్విట్టర్. నిజానికి ఇది వారికోసమే అని, మిగిలిన వారు వాళ్ళు మాట్లాడేవి,వాళ్ళు  అనుకునే భావాలూ , అప్డేట్ లనీ తెలుసుకోవడం కోసం మాత్రమే అక్కడ ఉన్నారు అని పొరబడ్డారు అందరూ. తరవాత తరవాత అందరికీ ఇది ఎలా ఉపయోగపడుతోందో అర్ధం అవడం , లక్షల ఎకౌంటు లు కోట్ల ఎకౌంటు లుగా మారడం జరిగిపోయింది.


ఏదైనా విషయాన్ని చాలా తక్కువ పదాలు ఉపయోగించి చెప్పడం ట్విట్టర్ లో కీలకం. ఇలాంటి సామాజిక మాధ్యమం ఒచ్చే సంవత్సరం మూసేస్తున్నారు అనే పుకార్లు షికారు చేస్తున్నాయి. 2017 నుంచీ ఇక ట్విట్టర్ ఉండదు అని ఫేస్ బుక్ మాత్రమే గతి అని అనుకునే టైం లో దీని మీద ట్విట్టర్ సమాధానం చెప్పింది. " ఈ వార్తలకి ఆధారాలు లేవు, ట్విట్టర్ ని మూసి వేసే అవకాశమే లేదు. ఆన్ లైన్ లో జరిగే వేధింపులని ట్విట్టర్ ఆపలేక పోతున్న కారణంగా మా వెబ్సైటు మూసేస్తున్నాం అని ఇటీవల ఎవరో అనడం అది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వడం గమనించాం నిజానికి అదంతా ఒట్టిదే . " అని ఈ సంస్థ ప్రతినిథి ఒకరు చెప్పారు. ఈ సంస్థ ని మూసేయ్యద్దు అంటూ ఎన్నో రిక్వస్ట్ తో కూడిన మెయిల్స్ ఒస్తున్నాయి అని అపోహాలు మర్చిపోండి అని ఆయన తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: