రోజుకొక కొత్త ఫోన్ తో స్మార్ట్ ఫోన్ ప్రపంచం మరింత వేగంగా దూసుకుని వెళుతోంది. ఇవాళ ఉన్న ఫీచర్ లు రేపు ఉండట్లేదు , ఇవాళ ఉన్న ఫోన్ లు కూడా రేపు దొరకట్లేదు . అంతటి సీరియస్ మార్కెట్ గా ఈ సెల్ ఫోన్ ల ప్రపంచం సాగుతోంది. షియామీ మీ 5 అనే సంస్థ నుంచి రాబోతున్న మీ 5 అనే స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన స్పెసిఫికేషన్ లు ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. దీని ఫీచర్ ల ముందు యాపిల్ ఫోన్ కూడా పనిచెయ్యదు అంటే నమ్మండి. 6 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 3డీ టచ్ తో పాటు, మరింత బ్యాకప్ ఇచ్చేలా 3490 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జీ వీఓ ఎల్ టీఈ దీని స్పెషల్ అని తెలుస్తోంది. 2.4 గీహెచ్ క్వాల్ కాం స్నాప్ డ్రాగెన్ 821 ప్రాసెసర్, 16/4 ఎంపీ కెమెరాలు, 4కే వీడియో సపోర్ట్ తదితర సౌకర్యాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరో రెండు వారాల్లో ఈ ఫోన్ ఇండియాలో విడుదల కావచ్చని సమాచారం. చైనాలో విడుదల చేయగానే, వెంటనే ఇండియాలోనూ ఫోన్ విక్రయాలు ప్రారంభించాలని సంస్థ భావిస్తున్నట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: