ఇందనంగా సౌర శక్తి ని వినియోగించుకుని ప్రపంచాన్ని చుట్టేసే సోలార్ ఇంపుల్స్ విమానం స్ఫూర్తి గా మరొక ప్రయోగానికి సైంటిస్ట్ లు సిద్దం అవుతున్నారు. సోలార్ ఇంపుల్స్ విపానం ఆకాశం లో చేసే ఫీట్ ని ఇప్పుడుసముద్రం లో చెయ్యడం కోసం ఒక పడవ సిద్దం అయ్యింది. ఎనర్జీ అబ్జర్వర్ అనే పడవ దీనికి సిద్దం అయ్యింది. సోలార్ ఇంపల్స్ విమానం కేవలం సౌరశక్తితో మాత్రమే నడవగా, ‘ఎనర్జీ అబ్జర్వర్’ మాత్రం సౌరశక్తితోపాటు, సముద్రంలో వీచే బలమైన గాలులను, నీటిని విడగొట్టడం ద్వారా పుట్టే హైడ్రోజన్‌ ను కూడా ఇంధనంగా వినియోగించుకోనుంది. ఫాన్స్ దేశానికి చెందిన రెండు కంపెనీలు ఈ యాత్ర ని సిద్దం చేస్తున్నాయి. దాదాపు యాభై దేశాల లోని నౌకాశ్రయాలని ఈ పడవ చుడుతుంది. దాదాపు నలభై కోట్ల తో ఫ్రాన్స్ ఈ ఎనర్జీ అబ్జార్వర్ లని సిద్దం చేసింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి లో ఈ ప్రపంచ యాత్ర మొదలు అవుతుంది దాదాపు ఆరు సంవత్సరాల పాటు ఈ యాత్ర సాగుతుంది అంటున్నారు. ఈ పడవ 30 మీటర్ల పొడవు, 12.80 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. దీనిలో సుమారు 130 చదరపు మీటర్ల వైశాల్యంలో సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేయనున్నారు. వీటితోపాటు రెండు వర్టికల్ యాక్సిస్ (నిట్ట నిలువుగా తిరిగే) విండ్ టర్బయిన్లతో పాటు, నీటిని ఆక్సిజన్, హైడ్రోజన్‌ గా విడగొట్టేందుకు అవసరమైన ఎలక్ట్రాలసిస్ పరికరాలను కూడా ఏర్పాటు చేయనున్నారు. దీంతో ఇది సోలార్, విండ్, ఎలక్ట్రాలసిస్ విధానాల ద్వారా పని చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: