టెలికామ్ రంగంలో జియో రేపిన సంచలనాలతో మిగతా టెలికం కంపెనీలు ఒక్కసారిగా కుదేలయ్యాయి. దీంతో మిగతా టెలికం కంపెనీలు ఇప్సంపుడు వినియోగదారులను ఆకట్టుకోవడంతో పాటు, ఉన్న కస్టమర్లు చేజారి పోకుండా కొత్త ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. జీయోకు పోటీగా ఇప్పటికే ఏయిర్ టెల్ భారీ ఆఫర్లను ప్రకటించగా, తాజాగా ఐడియా కూడా బంఫర్ ఆఫర్లను ప్రకటించేసింది.


జీయో ఎంటర్ అయిన తర్వాత ఎర్‌టెల్, ఐడియా తమ కస్టమర్లు చేజారిపోకుండా కాపాడుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నాయి. అతి తక్కువ ధరకు డేటా, ఏ నెట్‌వర్క్‌కైనా వాయిస్ కాల్స్ ఫ్రీ. ముఖేష్ అంబానీ నోటి నుంచి వచ్చిన ఈ రెండు మాటలు ఎయిర్‌టెల్, ఐడియాకు కోట్ల నష్టాన్ని మిగిల్చాయి. దీంతో ఈ రెండు కంపెనీలు ఆత్మరక్షణలో పడ్డాయి. డేటా ప్యాక్స్ రేట్లను కొంతవరకూ తగ్గించాయి.అయినా జీయోనే అగ్రగామిగా నిలుస్తోంది. 
 
దీంతో ఐడియా సరికొత్త ఆఫర్‌కు తెరలేపింది. ఈ ఆఫర్ ప్రకారం, ఐడియా వినియోగదారులు ఆఫ్‌లైన్‌లో కూడా సినిమాలను, వీడియోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఐడియా సెల్యులార్ మూవీ క్లబ్ యాప్‌‌ను డౌన్‌లోడ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే ఈ యాప్ ప్రస్తుతం బీటా వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. కానీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ కలిగి ఉండి... ఐడియా వినియోగదారులైతే ఈ అప్లికేషన్‌ను చెక్ చేసుకోవచ్చని ఐడియా ప్రతినిధులు సూచించారు.

ఈ యాప్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చాక యూజర్లపై కొంత ఛార్జి విధించే అవకాశముందని తెలిసింది. ఈ యాప్‌లో వల్ల కలిగే ప్రయోజనాలను పరిశీలిస్తే..ఆఫ్‌లైన్‌లో వీడియోలు, సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూజర్ల్ఎ ఆటో లాగిన్ ఆప్షన్ ఉంటుంది. యూజర్లు తమకు నచ్చిన క్వాలిటీలో వీడియోలను ఎంపిక చేసుకోవచ్చు. యూజర్లు ఒకేసారి రెండు వీడియోలను చూసేందుకు వీలుగా డ్యుయల్ స్క్రీన్ అందుబాటులో ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: