టెక్నాలజీ రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునిక కాలంలో అన్ని అవసరాలకు టెక్నాలజీనే పరిష్కారం చూపుతోంది. ప్రతిదానికి యంత్రాలను వాడడం, యాప్స్‌ను వినియోగించుకోవడం, ఈ మధ్యకాలంలో ఎక్కువై పోతోంది. అంతేనే ఇంట్లోనే కూర్చొని అన్ని పనులు చక్కబెట్టేస్తున్నారు నేటి తరం. అయితే ఇప్పుడు ఈ టెక్నాలజీ మరింత ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది.


ఎంత టెక్నాలజీ అభివృద్ధిలోకి వచ్చిన స్త్రీ, పురుషుల సెక్స్ సంబంధాలకు కూడా మిషన్స్ వాడేందుకు సిద్ధమైపోతున్నారు కొందరు. స్త్రీ పురుషుల మధ్య ఉండే అద్భుతమైన కలయికకు, పడక గది అనుభూతులకు కూడా రోబోలను వాడేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారటా కొందరు శాస్త్రవేత్తలు. ఒకవేళ అదే జరిగితే ఇక మనిషికి, మనిషికి మధ్య బంధం, సంబంధం పోయి మనిషికీ, మర మనిషికి మధ్య కొత్త కొత్త సంబంధం రాబోతోందంటున్నారు. ఎందుకంటే ఆ దిశగా ఇప్పటికే అడుగులు పడ్డట్లు చెబుతున్నారు. 


ఇకపై సెక్స్ అవసరాలకు, శృంగార కోరికలకు స్త్రీ, పురుషుడిపైనా.. పురుషుడు, స్త్రీ పైనా ఆధారపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు జోయెల్ స్నెల్ అనే రోబోటిక్‌ నిపుణుడు. ప్రేమికులకు, భార్యలకు భర్తల కంటే గొప్ప పడక సుఖాన్ని అందించే రోబోలు రెడీ అవుతున్నాయని చెబుతున్నాడు కిన్ వుడ్ కాలేజీకి చెందిన ఈ రోబోటిక్ నిపుణుడు. ప్రపంచీకరణ ప్రభావం ప్రస్తుత మానవ సంబంధాలను అత్యంత యాంత్రికంగా మార్చేస్తున్న తరుణంలో.. రాబోయే రోజుల్లో స్త్రీ పురుషుల మధ్య సెక్స్ సంబంధాలను కూడా యాంత్రికం చేయడానికి అతను తెగ ట్రై చేస్తున్నాడట. తమను కొనుక్కుని వెళ్లిన వ్యక్తుల టేస్ట్ కి తగ్గట్లు ఈ సెక్స్ రోబోలు వ్యవహరిస్తాయని.. వీటితో అత్యంత క్రియేటివిటిగా అనుభూతిని పొందొచ్చని చెబుతున్నారు సెక్స్ రోబోల మీద ప్రయోగాలు జరుపుతోన్న నిపుణులు.


అంతేకాదు మనుషుల కంటే రోబోలే ఆ విషయంలో అత్యుత్తమంగా వ్యవహరిస్తాయని మనుషులకు సాధ్యం కాని కొన్ని సెక్స్ రీతులను సైతం ఈ రోబోల ద్వారా అనుభవించవచ్చునని చెబుతున్నారు వీటి తయారీదారులు. ఈ పనిచేయడంలో కాస్త ఎంతో ఉపయోగం కూడా ఉందంటున్నారు. సెక్సువల్ క్రైమ్స్ పై పోరాటం చేయడానికి ఈ రోబోలు ఉపకరిస్తాయని అంటున్నారు. అంతే కాకుండా సురక్షితమైన సెక్స్ కి కూడా ఇవి అద్భుతంగా పనిచేస్తాయని వెల్లడించారు. 


అయితే.. మనుషుల మధ్య సెక్స్ సంబంధాలకు రోబోలు ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేవని సెక్సాలజిస్టులు ఈ విషయాన్ని వ్యతిరేకిస్తుండగా... ఇలా సెక్స్ రోబోలను ప్రోత్సహించడం మంచిది కాదని సెక్స్ థెరపిస్ట్ లు హెచ్చరిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో మనిషికి, మరమనిషికి మధ్య సెక్స్‌వల్‌ రిలేషన్స్‌ ఎలా ఉండబోతున్నాయో.. చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: