ఈ మధ్య కాలం లో రిలయన్స్ జియో సృష్టించిన సంచలనం ఎంతటిదో అందరికీ తెలిసిందే. ఈ సిమ్ కార్డ్ చేతిలో ఉంటే చాలు మూడు నెలల పాటు వాయిస్ కాల్స్ తో పాటు 4జీ ఇంటర్నెట్ కూడా ఫ్రీగా వాడుకోవచ్చు. ఈ ఒక్క కారణం చాలాదా జనాలు రిలయన్స్ స్టోర్ ల దగ్గర క్యూ కట్టడానికి ? రిలయన్స్ డిజిటల్ స్టోర్ లూ , రిలయన్స్ డిజిటల్ ఎక్స్ ప్రెస్ స్టోర్ ల ముందర సిమ్ కార్డ్ ల కోసం జనాలు క్యూ లు కట్టేస్తున్నారు. అయితే ఈ రిలయన్స్ సిమ్ ని చాలా తేలికగా పొందడం ఎలాగో ఇప్పుడు చూద్దాం. రిలయన్స్ సంస్థ సైతం ఈ తేలిక మార్గం ప్రకటించింది. ఇందులో భాగంగా 1800-200-200-2 నెంబరుకు మీ ఫోన్ నుంచి కాల్ చేయాలి. ఆపై మీ ఫోన్ కు ఓ ఎస్ఎంఎస్ వస్తుంది. అందులో ఉన్న లింక్ ను క్లిక్ చేస్తే, ప్లే స్టోర్ నుంచి 'మైజియో' యాప్ డౌన్ లోడ్ అవుతుంది. దాన్ని ఇంస్టాల్ చేసుకుని గెట్ జియో సిమ్ అనే బ్యానర్ ని ఓపెన్ చెయ్యాలి. అక్కడ గెట్ జియో ఆఫర్ కనిపిస్తుంది మీ మీ లొకేషన్ ని తెలియజేయ్యగానే మొబైల్ స్క్రీన్ మీద ఆఫర్ కోడ్ కనిపిస్తుంది. ఈ ఆఫర్ కోడ్ తో పాటు ఐడీ ప్రూఫ్ , ఫోటో , రెసిడెన్సీ ప్రూఫ్ తదితర వివరాలు తీసుకుని రిలయన్స్ స్టోర్ కి వెళితే వెంటనే సిమ్ కార్డ్ ఇచ్చేస్తారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: