దేశీయం గా మొబైల్స్ ని తయారు చేసే సంస్థ లావా బుధవారం 4 జీ లలోనే చౌక మొబైల్ ని మార్కెట్ లో విడుదల చేసింది. దేశం అంతా ఇప్పుడు 4జీ .. 4జీ అంటూ ఎగబడుతున్న వేళ ఈ రకమైన మొబైల్ ని మార్కెట్ లో విడుదల చెయ్యడం చాలా ఉపయోగకరం అని చెప్పాలి. ఏ 97 పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్ ధర దగ్గర దగ్గర ఆరువేల వరకూ ఉంది. 4జీ లో ఆండ్రాయిడ్ వెర్షన్ ని ఇస్తున్న ఈ ఫోన్ ధర చాలా తక్కువ అనే చెప్పాలి. ఆండ్రాయిడ్ మార్ష్ మెలో ఆపరేటింగ్ సిస్టం కలిగిన ఈ ఫోన్ 12 భారతీయ భాషల్ని కూడా సపోర్ట్ చేస్తోంది. ముందు వెనక 5 మెగా పిక్సల్ కెమెరాలు ఇచ్చింది లావా. కాంతి తక్కువగా ఉన్నప్పుడు కూడా క్వాలిటీ ఫోటోలు తీయడం దీనికి అదనపు ఫీచర్. ఎల్లీడీ లైట్ లు కూడా ఫోటోలకోసం అమర్చారు. ఫేస్‌బ్యూటీ, జిఫ్ మోడ్, వీడియో ఇమేజెస్ కాప్చర్, ఆడియో పిక్చర్లను ఇమేజ్‌లుగా సేవ్ చేసుకునే సౌలభ్యం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: