సింగిల్‌ స్క్రీన్‌ ల్యాప్‌టాప్‌లను మనమందరం వాడుతూనే ఉంటాం. కానీ.. మూడు స్క్రీన్ల ల్యాపీలను ఎక్కడైనా చూశారా? కచ్చితంగా చూసుండరు. కానీ.. ట్రెండ్‌ సృష్టించే అలాంటి ల్యాప్‌టాప్‌ వచ్చేసింది. దీని ప్రత్యేకత మూడు స్క్రీన్లు కలిగి ఉండట మే! అన్ని స్క్రీన్లు ఎందుకు? అనేగా మీ ప్రశ్న. దీన్ని ప్రత్యేకంగా గేమ్స్‌ కోసం రూపొందించారట.



అయితే, అమెరికాలోని ప్రముఖ గేమింగ్‌ అప్లికేషన్‌ సంస్థ రేజ‌ర్‌ మాత్రం అంద‌రిక‌న్నా భిన్నంగా ఆలోచించింది. ప్రపంచంలో ట్రిపుల్‌ డిస్‌ప్లే కలిగిన మొట్టమొదటి ల్యాపీని రూపొందించి అంద‌రి దృష్టిని త‌మ‌వైపుకి తిప్పుకుంది. మూడు స్క్రీన్లు ఉన్న‌ప్ప‌టికీ ఈ ల్యాప్‌టాప్‌కు ఒక్కటే కీబోర్డు ఉంటుంది. మూడు డిస్‌ప్లేలు 17.3 అంగుళాల వెడల్పుతో ఉంటాయి.



మూడూ ఒకదాని వెనక మరొకటి కలిసి ఉంటాయి. బటన్‌ నొక్కితే రెండు చెరోవైపు పక్కకు స్లైడ్‌ అయి పొడవాటి స్క్రీన్‌గా ఏర్పడతాయి. దానిపై గేమ్స్‌ ఆడుకోవచ్చట. ఈ ల్యాప్‌టాప్‌ బరువు 5.5 కిలోలకు అటుఇటుగా ఉంటుందని రేజర్‌ సంస్థ చెబుతోంది. ప్రపంచంలో ట్రిపుల్‌ డిస్‌ప్లే కలిగిన మొట్టమొదటి ల్యాపీ ఇదేనట. అమెరికాలోని లాస్‌వెగాస్‌లో జరిగిన సీఈఎస్‌ ట్రేడ్‌ షోలో ఇది విశేషంగా ఆకట్టుకుంది.




మరింత సమాచారం తెలుసుకోండి: