రిలయన్స్ జియో దెబ్బకి  అందరూ చచ్చినట్టు దిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. రియలన్స్ జియో ఇప్పుడు ఊహించని విధంగా కస్టమర్ లకి బంపర్ ఆఫర్ లు ప్రకటిస్తోంది. ఇటీవ‌లే ఎయిర్‌టెల్ తమ 4జీ నెట్_వర్క్_లోకి అప్_గ్రేడ్ అయ్యే వినియోగ‌దారుల‌కు ఏడాదంతా ఉచిత 4జీ డేటాను ఇస్తామ‌ని ప్ర‌క‌టించింది.తాజాగా ఐడియా కూడా అదే బాట‌లో న‌డవాల‌ని నిర్ణయించుకుంది. ఎంపికచేసిన అపరిమిత కాలింగ్_ ప్లాన్స్_లో డేటా వాడుక పరిమితిని పెంచిన‌ట్లు పేర్కొంది. త‌మ‌ కొత్త 4జీ హ్యాండ్_సెట్లలోకి అప్_గ్రేడ్ అయ్యే వినియోగ‌దారుల‌కు అదనంగా 3జీబీ మొబైల్ బ్రాడ్_బాండ్ ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. ఈ ఆఫ‌ర్‌తో త‌మ వినియోగ‌దారులంతా తమ ప్లాన్స్_పై ఉచిత డేటాను పొందవచ్చని చెప్పింది.అంతేగాక‌ కొత్త ఐడియా 4జీ డేటా ఆఫర్_ కింద వినియోగ‌దారులు రూ.348తో రీచార్జ్ చేసుకుంటే ప‌లు ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చ‌ని తెలిపింది. ఈ రీచార్జ్‌తో ఇప్ప‌టికే ప్రీపెయిడ్ 4జీ హ్యాండ్ సెట్లు ఉన్న‌ కస్టమర్లు 28 రోజుల పాటు 1జీబీ డేటాతో పాటు అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్_లను పొందవచ్చని,  కొత్త 4జీ హ్యాండ్_సెట్ల వినియోగ‌దారులు దానికి మ‌రింత‌ అదనంగా 3జీబీ డేటాను పొందుతారని చెప్పింది. ఇక‌ ఐడియా పోస్టు పెయిడ్ వినియోగ‌దారులయితే రూ.499 రెంటల్ ప్లాన్_పై సబ్_స్క్రైబ్ అవ్వాల్సి ఉంటుందని ఐడియా ప్ర‌తినిధులు తెలిపారు. దీంతో  4జీ హ్యాండ్_సెట్ కస్టమర్లు అన్‌లిమిటెడ్‌ లోకల్, నేషనల్, ఇన్_కమింగ్ రోమింగ్ కాల్స్_ స‌హా 3జీబీ ఉచిత డేటాను పొందవచ్చ‌ని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: