.

 

 

 

దేశవాళీ మొబైల్ దిగ్గజ సంస్థ మైక్రో మ్యాక్స్ నుంచి బడ్జెట్ లో మరొక రెండు ఫోన్ లు వచ్చేసాయి. వీడియో 3 , వీడియో 4 అనే పేర్లతో ఈ సంస్థ కొత్త ఫోన్ లు కోట్ చేసింది. 2000 ఎంఏహెచ్ బ్యాటరీ సామ‌ర్థ్యంతో విడుద‌లైన‌ వీడియో 3 ఫీచర్ల విష‌యానికి వ‌స్తే.. 5 ఇంచ్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 1280 X 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8 జీబీ అంత‌ర్గ‌త స్టోరేజ్‌, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో డ్యుయల్ సిమ్, 4జీ వీవోఎల్‌టీఈ 5 మెగాపిక్సల్ రియర్ కెమెరా విత్ ఎల్‌ఈడీ ఫ్లాష్, 2 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, బ్లూటూత్ 4.0 ఉన్నాయి. 'వీడియో 3' ధ‌ర రూ.5,749.

 

 

 

 

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: