ఫ్రీ ఆఫర్స్‌తో మార్కెట్‌లో చెరగని ముద్ర వేసుకున్న రిలయన్స్‌ జియో మరో సంచలనానికి తెరతీస్తోంది. రిలయన్స్ కు కొత్తగా '6' అంకెతో మొదలయ్యే సెల్ ఫోన్ నంబర్ సిరీస్ ను ఇచ్చేందుకు డాట్ (డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికం) అనుమతి లభించింది.  ఇప్పటివరకూ రిలయన్స్ జియో సిమ్ తీసుకున్న వారికి 7,8,9 సిరీస్‌లో నంబర్ కేటాయించిన జియో ఇక మీదట కొత్తగా సిమ్ తీసుకునే వారికి ఈ మూడు సిరీస్‌లో నంబర్లను నిలుపుదల చేయాలని భావిస్తోంది.



ప్రస్తుతం అసోం, రాజస్థాన్‌, తమిళనాడులో తొలుత ఈ సిరీస్‌ ఫోన్‌ నెంబర్లను ప్రారంభించేందుకు అనుమతి లభించినట్లు తెలుస్తోంది. మధ్యప్రదేశ్‌ గుజరాత్‌కు 7 సిరీస్‌, కోల్‌కతా, మహారాష్ట్రకు 8 సిరీస్‌ ఎంఎస్‌సీ (మొబైల్‌ స్విచింగ్‌ కోడ్‌)ను డాట్‌ జియోకు కేటాయించినట్లు సమాచారం.  ఈ నంబర్ల కేటాయింపు కూడా ఎంఎస్‌సీ(మొబైల్ స్విచ్ఛింగ్ కోడ్) ఆధారంగా జరుగుతుంది. 60010 నుంచి 60019 ఎంఎస్‌సీ సిరీస్‌‌ను రాజస్థాన్‌కు, 60020 నుంచి 60029 సిరీస్‌ను అస్సాంకు, 60030 నుంచి 60039 ఎంఎస్‌సీ సిరీస్‌లో ఉన్న నంబర్లను కేటాయించింది. 



మరోవైపు జియో కస్టమర్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. డిసెంబర్‌ 31 నాటికి వినియోగదారుల సంఖ్య 7.24కోట్లకు చేరింది. కొత్తగా తీసుకొస్తున్న సిరీస్‌ ద్వారా మరింతమంది కస్టమర్లు ఆకర్షితులయ్యే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: