ఫ్లిప్ కార్ట్ సంస్థ ఈ కామర్స్ ని కొనే ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం మీద ఎట్టకేలకి ఒక ఫైనల్ డీల్ ని కుదుర్చుకుని సక్సెస్ఫుల్ గా క్లోజ్ చేసేసింది ఫ్లిప్ కార్ట్. మ‌రోవైపు టెన్సెంట్, మైక్రోసాఫ్ట్‌ల నుంచి పెద్ద ఎత్తున‌ పెట్టుబడులను సాధించినట్టు ఈ రోజు పేర్కొంది. దీంతో మార్కెట్లో అమెజాన్‌కు ప్లిప్‌కార్ట్ నుంచి గ‌ట్టిపోటీ ఎదురుకానుంది. ఈబే భారత్‌లోని వ్యాపారాన్ని ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించడంతో భారీ పెట్టుబడులు వ‌స్తున్నాయి.  టెన్సెంట్, మైక్రోసాఫ్ట్‌ , ఈబే నుంచి సుమారు 1.4 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను సాధించింది. ఈబే ఫ్లిప్‌కార్ట్ లో స్వతంత్ర సంస్థగా కొన‌సాగ‌నుంది. ఫ్లిప్‌కార్ట్ చేసుకున్న ఒప్పందం ఒక మైలురాయని ఆ సంస్థ‌ ఫౌండర్లు సచిన్‌ బన్సల్‌, బిన్నీ బన్స్‌ల్ వ్యాఖ్యానించారు

మరింత సమాచారం తెలుసుకోండి: