Image result for i/o conference 2017

సాంకేతిక దిగ్గజం "గూగుల్" సాంకెతికత ప్రేమికులు ఎంతో ఎంతో సంతోషంగా నిరీక్షించే తన డెవలపర్ల "వార్షిక ఐ/ఓ కాన్ఫరెన్స్  " మౌంటెన్-వ్యూ లో నిన్ననే మే 17 వ తేదీన గూగుల్ ప్రధాన కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించింది. ఈ సారి ఎలాంటి కొత్త కొత్త వింత వింత టెక్ ప్రొడక్ట్ లు మార్కెట్లోకి గూగుల్ తీసుకువస్తుందోనని అని ఆసక్తిగా గమనిస్తుంటారు. 


ఈ సారికూడా గతంలోకంటే ఎక్కువగా టెక్ అభిమానుల ఆసక్తికు సంతృప్తినివ్వటానికే గూగుల్ సరికొత్త ఫీచర్లతో కూడిన సరికొత్త డివైజెస్ ను, గాడ్జెట్స్ ను ను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. ఆ ప్రోడక్ట్స్ ఏమంటే ఆండ్రాయిడ్ గో, కొత్త వీఆర్ హెడ్ సెట్, గూగుల్ లెన్స్ ఇలాంటి కొన్ని కీలకమైన వాటిని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ డెవలపర్ల సమావేశంలో ప్రకటించారు. 


వీటన్నంటిల్లో సాంకేతిక ప్రియులను ఎక్కువగా ఆకట్టుకున్నది "గూగుల్ లెన్స్" దీన్ని టెక్నాలజీలో మరో నూతన విప్లవంగా అభివర్ణించిన సుందర్ పిచాయ్, అసలు గూగుల్ లెన్స్  యూజర్లకు ఎలా ఉపయోగపడుతుందో ఆయన మాటల్లోనే చదవండి. 

Image result for sunder pichai & google lens 

"ఇన్ని రోజులు మనం రోడ్డుపై వెళ్లేటప్పుడు దేనినైనా చూస్తే, దాని గురించి తెలుసుకోవాలంటే, ఆ పేరును టైప్ చేసి సెర్చ్ చేసేవాళ్లం. కానీ ఇప్పుడు అలాంటి అవసరమే ఉండదు. మీకు సమాచారం కావాల్సిన వస్తువును ఫోటో తీసి ఇమేజ్ సెర్చ్ చేస్తే చాలు. దాన్ని గురించి పూర్తి సమాచారం మన ముందుంటుంది. 


దీనికల్లా మనం చేయాల్సింది మన స్మార్ట్ ఫోన్లో "గూగుల్ లెన్స్" డౌన్ లోడ్ చేసుకోవడమే. ఉదాహరణకు మనకో ఫ్లవర్ కనిపించింది అనుకుంటే.  ఆ ఫ్లవర్ ఏంటి? దాని వివరాలు కావాలంటే? ఆ పువ్వును లెన్స్ లో ఫోటో తీస్తే చాలు మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది.
 
అలాగే మనకు తెలియని ప్రాంతానికి వెళ్లినప్పుడు అక్కడి లాంగ్వేజ్ మనకు అర్థం కాకపోవచ్చు. ఏదైనా రెస్టారెంట్ కు వెళ్లి తిన్నాలన్నా, ఆర్డర్ చేయాలన్నా జంకుతాం. దీనికోసం జస్ట్ మీ ముందున్న డిష్ ను ఫోటో తీసి ఇమేజ్ సెర్చ్ చేస్తే చాలు దాని గురించి వివిధ రకాల సమాచారాన్ని మనం తెలుసుకోవచ్చు"  


Image result for google lens

ఇలా ఇమేజ్ సెర్చ్ తోనే అన్నింటి వివరాలను యూజర్లు తెలుసుకునేలా గూగుల్  ఈ ఆప్షన్ ను ప్రవేశపెట్టింది. అయితే మనం స్కాన్ చేసే వస్తువు వివరాలు గూగుల్ లో ఉంటేనే, దాన్ని సమాచారం మనం పొందుతాము. గూగుల్ లెన్స్ పేరుతో తీసుకొచ్చిన ఈ వినూత్న విప్లవ ఫీచర్ త్వరలోనే స్మార్ట్ ఫోన్లలోకి అందుబాటులోకి వస్తుందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. 

Image result for google lens

ఇంకేం గూగిల్ సెర్చ్ లో ఏదైనా పిక్చర్ పెట్టండి-సెర్చ్ చేయండి-దాని సినిమా అంతా మీముందే! "  వస్తువులు మాత్రమే సుమా!  డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ ఫ్రం అజ్" 

Image result for i/o conference 2017 google new products

మరింత సమాచారం తెలుసుకోండి: