ఇప్పుుడు భారత దేశంలో ఎక్కడ చూసినా జియో..మాటే ఎక్కువ వినిపిస్తుంది.  కమ్యూనికేషన్ రంగంలో ఒకప్పుడు రిలయన్స్ ఎంతో ప్రభావం  తీసుకు వచ్చిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  ఆ సమయంలో సామాన్యులు సైతం సెల్ ఫోన్ ఉపయోగం ఏంటో తెలిసిపోయింది.  ఆ తర్వాత ఎన్నో మార్పులు చేర్పులు సంతరించుకున్నాయి.  అంతే కాదు నెట్ వర్క్ లో కూడా కాంపిటీషన్ బాగా పెరిగిపోవడంతో కాల్స్ రేట్ కూడా బాగా తగ్గాయి. తాజాగా ఇప్పుడు జియో వినియోగదారులకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన విషయం తెలిసిందే.  
Image result for jio 4g mobile
ఆగష్టు 24వ తేదీ నుంచి జియో 4జి ఫోన్ ప్రీ బుకింగ్స్  జరగనున్నాయి. వినియోగదారులను ఆకర్షించేందుకు రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ జియో 4జి ఫీచర్ ఫోన్‌ను ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటన చేసిన విషయం తెలిసిందే.  అయితే ఈ ఫోన్ చూడటానికి అన్నీ బాగున్నాయి కానీ..యాప్స్ విషయంలో కాస్త ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా ఈ 4జీ ఫోన్ లో వాట్సాప్ను  వాడుకునే వీలులేదని గాడ్జెట్స్ 360 అనే వెబ్‍సైట్ షాకింగ్ న్యూస్‌ వెల్లడించింది.  
Image result for whatsapp
కాకపోతే దీని స్థానంలో జియోచాట్ ఉంటుంది, అంతే కాకుండా జియో యాప్స్ ప్రీలోడెడ్‌గా వస్తాయని, వీడియో కాలింగ్ చేసుకోవచ్చని, సినిమాలు చూసుకోవచ్చని, ఫేస్‌బుక్, యూట్యూబ్ తదితర సోషల్ మీడియాను ఉపయోగించుకోవచ్చని జియో సంస్థ పేర్కొంది. ప్రస్తుతం భారత దేశంలో  20 కోట్ల మంది వాట్సాప్ యూజర్లు ఉన్నారు..వారందరికీ ఇది షాకింగ్ న్యూసే అని చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: