ఈ మద్య ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ మెయింటేన్ చేస్తున్నారు.  సాధారణంగా ఫోన్ అన్న తర్వాత చాలా జాగ్రత్తలు పాటించాల్సి వస్తుంది. ముఖ్యంగా తొలుత ఫోన్ ను ఫుల్ గా ఛార్జ్ చేయండి అని రికమెండ్ చేస్తాడు. వాడటానికి ముందు కనీసం ఎనిమిది గంటల పాటు ఛార్జింగ్ పెట్టాలని మొబైల్ కంపెనీలు కూడా పేర్కొంటాయి. 

మొబైల్ ఫోన్ స్పేర్ పార్ట్స్ వివిధ చోట్ల తయారవుతుంటాయి. బ్యాటరీ కూడా అంతే... ఎక్కడో తయారవుతుంది. ఇలా తయారైన బ్యాటరీ, మొబైల్ కంపెనీకి చేరుతుంది. మరోవైపు, కొత్త ఫోన్ ను ఆన్ చేయగానే ఫార్మ్ వేర్ వంటివి, ఫోన్లో ఉన్న అప్లికేషన్లకు అప్ డేట్స్ వచ్చి ఉండొచ్చు. ఇవన్నీ స్మూత్ గా ఇన్ స్టాల్ కావాలంటే, ఫోన్ లో సరిపడా బ్యాటరీ పర్సెంటేజ్ ఉండాలి.

అక్కడ అసెంబుల్ అయిన మొబైల్ తో పాటు, ప్యాక్ అవుతుంది. అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటర్ కు, అక్కడి నుంచి షోరూమ్ కు, అక్కడి నుంచి మన చేతిలోకి వస్తుంది. దీనికి చాలా సమయం పడుతుంది. ఈ క్రమంలో బ్యాటరీలో ఛార్జింగ్ తగ్గిపోయి ఉంటుంది. అందుకోసం కనీసం ఎనిమిది గంటలపాటు ఛార్జింగ్ పెట్టాలని ఫోన్ కంపెనీలు చెబుతుంటాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: