యూసీ బ్రౌజర్ ఉపయోగించే స్మార్ట్‌ఫోన్ యూజర్లకు ఇది కచ్చితంగా శుభవార్తే.  గూగుల్ నియ‌మాల‌కు విరుద్ధంగా ప్ర‌వ‌ర్తించిన కార‌ణంగా ప్లే స్టోర్ నుంచి నిషేధానికి గురైన ప్ర‌ముఖ మొబైల్ యాప్ యూసీ బ్రౌజ‌ర్‌... గురువారం రోజు ప్లే స్టోర్‌లో ప్ర‌త్య‌క్ష‌మైంది.  గూగుల్ నిబంధనలకు అనుగుణంగా అప్‌డేటెడ్ టెక్నికల్ సెట్టింగ్స్‌తో గూగుల్ ప్లే స్టోర్‌లో కొత్త యూసీ బ్రౌజర్ సిద్ధంగా ఉందని సంస్థ పేర్కొంది.  గత వారం రోజుల కిందటే అలీబాబా గ్రూప్‌నకు చెందిన యూసీ బ్రౌజర్ ఆండ్రాయిడ్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి మాయమైన సంగతి తెలిసిందే.
Image result for యూసీ బ్రౌజ‌ర్‌
గత  కొద్ది నెలల కిందట కూడా యూసీ బ్రౌజర్ ఆండ్రాయిడ్ యాప్‌పై అనేక వివాదాలు చెలరేగాయి. ఆ యాప్ చైనాకు చెందిన ఆలీబాబా గ్రూప్‌ది కనుక సదరు యాప్ వినియోగదారుల ఫోన్ల నుంచి డేటాను తస్కరించి చైనా సర్వర్లకు చేరవేస్తుందని ఆరోపణలు వచ్చాయి. మొబైల్ డేటాను త‌క్కువ వినియోగించుకునేలా రూపొందించిన యూసీ బ్రౌజ‌ర్‌ను ప్ర‌స్తుతం దేశంలో చాలా మంది వినియోగిస్తున్నారు.

నెల‌లో దాదాపు 100 మిలియ‌న్ల మంది యూజ‌ర్లు ఈ యాప్‌ను ఉప‌యోగిస్తున్నారు. అయితే ఈ యాప్ సేవ‌ల్లో భాగంగా కొన్ని పెయిడ్ యాప్‌ల‌ను ఇన్‌స్టాల్ చేసుకోమ‌ని ప్ర‌మోట్ చేస్తున్న కార‌ణంగా గూగుల్ ప్లేస్టోర్ దీనిపై నిషేధం విధించినట్లు వార్తలు వచ్చాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: