కావలిసినవి : బియ్యం -రెండు కప్పులు , క్యారెట్,క్యాప్సికం ,క్యాలిఫ్లవర్ ముక్కలు-కప్పు చొప్పున ,పచ్చిమిర్చి -నాలుగు,నిమ్మకాయలు- రెండు,అల్లం -చిన్న ముక్క ,కొత్తి మీర-కట్ట ,కరివేపాకు -రెండు రెమ్మలు , ఎండుమిర్చి -నాలుగు ,ఆవాలు-చెంచా,ఉప్పు ,నూనే-తగినంత . పొడికోసం: ఆవాలు -రెండు టేబుల్ స్పూన్లు ,ధనియాలు ,జీలకర్ర ,శనగపప్పు -టేబుల్ స్పూన్ చప్పున , మెంతులు-అర చెంచా,ఎండు మిర్చి -నాలుగు ,బెల్లం -టేబుల్ స్పూన్ ,బాణలిలో కొంచెం నూనె వేసి ఈ మిశ్రమాలన్నింటిని వేయించి పొడి చేసుకోవాలి .


ముందుగా అన్నాన్ని పొడిపొడిగా వండి పెట్టుకోవాలి .ఒక పాత్రలో కూరగాయ ముక్కలు తీసుకోని కొంచెం ఉప్పు , తగినంత నీరు చేర్చి ఉడికించుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు ,ఎండు మిర్చి ,కరివేపాకు,సన్నగా తరిగిన అల్లం ,పచ్చిమిర్చి వేవాలి .


తరువాత ఉడికించిన కూరగాయ ముక్కలు ,పసుపు ,ఉప్పు చేర్చి బాగా కలపాలి .ముక్కలు బాగా వేగాక తాయారు చేసి పెట్టుకున్న పులిహొర పొడి ,నిమ్మకాయ రసం చేర్చి పాత్రను కిందకు దించాలి.ఇందులో కొత్తిమిర ,అన్నం వేసి కలిపితే సరి.వెజ్ పులిహొర రెడీ .

మరింత సమాచారం తెలుసుకోండి: