షాహీ మూర్గ్ చికెన్ కుర్మా  కావాలసిన పధార్థాలు :  చికెన్ : 200 గ్రాములు  ఉల్లిపాయ ముద్ద :కప్పు టమాటాగుజ్జు : అరకప్పు  పెరుగు : 50 గ్రాములు  అల్లం వెల్లుల్లి ముద్ద : చెంచా పచ్చిమిర్చి ముద్ద : చెంచా యాలకులు, లవంగాలు , దాల్చినచెక్క, కొన్ని (వీటిలో సగం వేయించి పొడి చేసుకోవాలి.) జీలకర్ర పొడి : చెంచా,  కారం, ధనియాలపొడి, : అరచెంచా చొప్పున ఉప్పు : రుచితగినంత క్రీమ్ : 2 చెంచాలు  


తయారీ విధానం : బాండీలో నూనె వేడి చేసి యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు వేయాలి. కొద్ది సేపటికీ పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయల ముద్ద చేర్చి మగ్గాక నీళ్లుపోయాలి. నూనె తేలాక సుగంథద్రవ్యాల పొడి, జీలకర్ర ధనియాల పొడి, కారం, ఉప్పు వేసి మరి కాసిని నీళ్లు పోయాలి.


ఐదు నిమిషాలయ్యాక చికెన్ వేసి మూతపెట్టాలి. అది ఉడుకుతుండగానే టమాటాల గుజ్జు, పెరుగు వేసి కలియతిప్పాలి. కొద్దిసేపటకి గ్రేవీ చిక్కగా తయారవుతుంది. అప్పడు పచ్చిమిర్చి కొత్తిమీర, క్రీముతో అలంకంరించి దించేస్తే షాహి మూర్ట్ చికెన్ కుర్మా సిద్దమయినట్లే.  

మరింత సమాచారం తెలుసుకోండి: