సాధారణంగా మనం పరోటాలోకి ఆలు కర్రీ లేదా మంసాహారం తీసకుంటాం..అయితే ఆలూ తో ఎన్నో రకాల వంటకాలు చేస్తుంటారు. ఇప్పుడు మనం ఆలూ అమృత్ సర్ ఎలా తయారు చేస్తారో చూద్దామా! 

ఆలూ అమృత్ సర్ తయారీకి కావాలిసిన పధార్థాలు:   బంగాళదుంపలు : 500 గ్రాములు ఉల్లితరుగు : 2  అల్లంవెల్లుల్లి పేస్ట్ : 2 టీ స్పూన్లు వాయు : అర స్పూన్  ఉప్పు : రుచికి తగ్గుట్టు శనగపిండి : 4-5 కప్స్ మిరపొడి : 2 టీ స్పూన్లు పంజాబీ గరంమసాలా : 1 టీ స్పూన్ పసుపు : ½ టీ స్పూన్లు పంచదార : ఆఫ్ టీ స్పూన్ నూనె : వేయించడానికి సరిపడా కొత్తిమీర : చిన్న కట్ట 


తయారు చేయువిధానం : బంగాళదుంపలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక గిన్నెలో శనగపిండి. అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, వాము, గరంమసాలా వేసి బాగా కలపాలి. బంగాళదుంప ముక్కలను ఇందులో వేసి కలిపి పావుగంటసేపు నాననివ్వాలి. తరువాత అదే బాణలిలో ఉల్లితరుగు వేసి గోదుమరంగు వచ్చేవరకు వేయించాలి. 


తరువాత ఉప్పు, పసుపు మిరప్పొడి, గరంమసాలా, ధనియాలపొడి వేసి బాగా కలపాలి. తరవాత వేయించి ఉంచుకున్న బంగాళదుంప ముక్కలను ఇందులో వేసి మంటను బాగా తగ్గించి రెండు నిమిషాలు ఉంచి దించేయాలి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేయాలి. ఆలు అమృత్ సర్ పరాఠాలలోకి చాలా బావుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: