మెదడు కోసం:  వాల్ నట్ చూడడానికి అచ్చం మెదడులాగానే ఉంటుంది. మెదడులోని ముడతలను పోలి దీని నిర్మాణం ఉంటుంద. ఇందులో ఒమెగా-3 ఫ్యాట్ యాసిడ్స్ పాళ్లు చాలా ఎక్కువ. ఇవి మెదడులోని కణాలు చురుగ్గా పనిచేసేలా, న్యూరాన్ల మధ్య సమాచారం వేగంగా జరిగేలా చూస్తాయి. అందుకే మన జ్ఞాపకశక్తి బాగా ఉండి, వేగంగా నిర్ణయాలు తీసుకోవటం కోసం, నరాల మెరుగైన ఆరోగ్యం కోసం వాల్ తినడం చాలా మంచిది.  ఓవరీ ఆరోగ్యం కోసం ఆలివ్ :  మహిళల్లో ఓవరీస్ చూడ్డానికి అచ్చం ఆలివ్ పళ్లలాగే ఉంటాయి. ఒక ఇటాలియన్ అధ్యయనం ప్రకారం నిత్యం ఆలివ్ ఆయిల్ వాడే మహిళల్లో మిగితా సాధారణ స్త్రీలతో పోలిస్తే క్యాన్సర్ వచ్చే రిస్క్ 30 శాతం తగ్గుతుందని తేలింది. దీనికి గల కారణాలు ఇంకా నిర్థష్టంగా తెలియనప్పటికీ ఈ నూనెలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వుల వల్లన ఇది సాధ్యమవుతోందని శాస్త్రవేత్తలు అంచనా. ఆలివ్ నూనె వాడేవారిలో అది క్యాన్సర్ జన్యువులను అణగదొక్కుతుందని కొందరు పరిశోధకులు ఒక సిద్దాంతాన్ని ప్రతిపాధించారు. మీ అందమైన కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే క్యారెట్ తీసుకోవాలి. క్యారెట్ ను అడ్డంగా కోసి చూడండీ, అది అచ్చం కన్నులోని నల్లగుడ్డు ఆకృతి(ప్యూనిల్ అండ్ ఐరిస్) ఉంటుంది. క్యారట్లోని బీటా కెరొటిస్ నుంచే కంటి ఆరోగ్యానికి దోహదపడే విటమిన్-ఏ వస్తుంది. కంటిలో ఉండే కార్నియా కణాలు ఆరోగ్య నిర్వహణ కోసం కూడా విటమిన్ ఏ చాలా మంచిది. (కార్నియా ఒక పారదర్శకమైన పొర, ఇది అనేక సూక్ష్మజీవులు, ఇన్ఫెక్షన్లు, ఇన్ ప్లమేషన్, దుమము, ధూళి వంటి సమస్యలను కంటిని కాపాడుతుంది.).  మీ గుండె లయబద్దంగా ఉండాలి అంటే ... ఒక ద్రాక్ష గుత్తిని దూరం నుంచి చూస్తే అది అచ్చం గుండె ఆకృతిలోనే కనిపిస్తుంటుంది. కొంతమేరకు ద్రాక్షకు ఉండే పర్పుల్ రంగుతో గుండెకాయ రంగుకు దగ్గరగా ఉంటుంది. ద్రాక్షలోని ప్లేవనాయిడ్స్ అనే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది ప్లేవనాయిడ్స్ గుండెజబ్బులను నివారించడంలో తోడ్పడుతాయి.   ప్యాంక్రియాస్ కోసం...  చిలకడదుంప ఆకృతి అచ్చం ప్యాంక్రియాటిక్ గ్రంథినే పోలి ఉంటుంది. చిలకడదుంప రక్తంలో చక్కెర విడుదలను నియత్రించడానికి పనిచేస్తుంది. అందుకే చిలకడదుంపకు స్వీట్ పొటాలో అన్న పేరున్నా సరే.... స్వీట్ తినకూడదని చక్కెర వ్యాధి గ్రస్తులు దీన్ని నిరభ్యంతరంగా తినవచ్చు.  జీర్ణవ్యవస్థ సక్రమంగా కొనసాగాలంటే ...  బొప్పాయి నిలువుకోత అచ్చం కడుపు కుహరంలా పోలి ఉండటం వల్ల బొప్పాయితో జీర్ణ కోసం వ్యవస్థ మెరుగుపడుతుందనేది నిపుణుల మాట, మన జీర్ణక్రియ జరిగే మార్గమంతా ఒక మెత్తటి కుంచెతో శుభ్రం చేసినట్లుగా ఉండాలంటే రోజూ ఉదయం భోజనానికి ముందుగా ఒక బౌల్ లేదా రాత్రి భోజనం తర్వాత ఒక బౌల్ బొప్పాయి పండ్లు తినాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: