సాధారణంగా మహిళలు ఎంతటి సౌందర్యవంతులో అందరికీ తెలిసిన విషయమే అయితే సహజ సౌందర్యానికి మరికొన్ని మెరుగులు దిద్దుకొంటే ఆ సౌందర్యం ఎప్పటీ అలాగే నిలిపి ఉంటుంది. అందంగా, రూపవతి, పుట్టడమే కాదు పుట్టనప్పటి నుండి వయస్సు పెరిగే కొద్ది శరీరం మీద, అలంకరణ మీద, వస్త్రాల మీ మహిళలకు మోజు పెరుగుతుంటుంద. ప్రతిదీ కొత్తగా వేసుకోవాలని, కొత్తగా కనబడాలని ఆరాటపడుతుంటుంది.      ఒక్కొక్కొ సందర్భంలో ఒక్కోరకంగా తయారవడానికి ఉత్సాహం చూపిస్తుంది. ముఖ్యంగా మహిళలు వేసుకునే మేకప్ విషయంలోనూ, వారు ధరించి దుస్తుల విషయంల్లోనూ ఎక్కవ జాగ్రత్తలు తీసుకొంటారు. మేకప్ ఎలా వేసుకున్నా దానికి తగ్గవస్త్రాధారణ ఉండాలి. ముఖ్యంగా మహిళలు ముఖం, కాళ్లు, చేతులు వంటి బాహ్యంగా కనిపించే అవయవాలను ఎంత ప్రాధాన్యతను ఇస్తారో అంతే ప్రాధాన్యతను వీపు బాగంలో కూడా చూపించాలి, లేదంటే ఎంత మేకప్ చేసుకున్నా ముందు వైపు ఎక్కవ ఆకర్షించేలా ఉండి, వెనుక వైపు ఆసహ్యంచుకొనేలా ఉండకూడదు.  మహిళలు ఒకప్పుడు శరీరం నిండుగా కప్పి ఉండే విధంగా బ్లౌజులు(జాకెట్టు) కుట్టించుకొనేవారు. అయితే అది రాను రాను ఫ్యాషన్ వైపు మొగ్గు చూపడంతో కొద్దికొద్దిగా బ్యాక్ నెక్, ప్రెంట్ నెక్ క్రిందకి తగ్గించి ఒళ్లు కనబడేలా ఇతరులను ఆకర్షించేలా వేసుకోవడం ప్రారంభించారు. అయితే అలా వేసుకోవాలంటే చక్కటి శరీర ఆకృతి, శరీర ఛాయతోపాటు, ఎటువంటి చర్మ సంబంధిత సమస్యలు లేకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే కొంత మంది మహిళల వీపు నిండా మొటిమలు, కాయలు వంటివి ఉండే అందరూ ధరించే అందమైన వి-నెక్, లేదా ఓ-నెక్ జాకెట్లు వేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది.  మహిళలకు ముందు బాగమే కాదు... వెనుక భాగం కూడా నున్నగా నిగ, నిగ లాడుతూ వుంటే, మరింత సెక్సీ అపీల్ కనపడుతుంది. అందుకుగాను సింపుల్గా ఇంట్లోనే ఏం చేయాలో చూడండి.... చర్మానికి గుడ్డు మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. కాబట్టి గుడ్డులోని తెల్లని సొనను తీసుకొని అందులో ఒక చెంచా నిమ్మరసం కలపి వీపు మొత్తానికి పట్టించి పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకుంటే నున్నగా నిగనిగలాడుతుంటుంది. ఒక బౌల్ తో రెండు చెంచాల పంచదార, రెండు చెంచాల తేనె, రెండు చెంచాల నిమ్మరసం సమంగా తీసుకొని దానికి కొద్దిగా దానిమ్మ గింజలను జతచేసి మెత్తని పేస్టులా తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వీపు బాగానికి బాగా పట్టించి ఇరవైనిమిషాల తర్వాత టీష్యూ పేపర్ లేదా పొడి వస్త్రంతో పూర్తిగా తుడిచేసి తర్వాత పెరుగును అప్లై చేయాలి. పెరుగు తడి ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఆరెంజ్ తొక్కలను ఎండ బెట్టి, తర్వాత వాటిని నీళ్లల్లో ఒక రోజురాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు పాలు, నానిన ఆరెంజ్ తొక్కలను మిక్సిలో మెత్తని పేస్ట్ లా చేసుకొని, ఈ మిశ్రమాన్ని వీపుకు అప్లై చేయాలి. అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. టామోటు గుజ్జు లేదా బాగా పండిన టమోటో ముక్కలను వీపు భాగంలో భాగా రుద్ది, అరగంట తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసేసుకోవాలి. మెంతులను నీళ్లల్లో రాత్రంతా నానపెట్టి, మరుసటి రోజు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి, దీనికి కొద్దిగా పెరుగు కలిపి, వీపుకు రాయాలి, అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోంటే సున్నీతమైన చర్మం మీ సొంతం అవుతుంది. రెండు చెంచాల రోజ్ వాటర్ లో రెండు చెంచాల తేనె కలిపి బాగా మిక్స్ చేసి వీపుకు పట్టించి అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్ర చేసుకోవాలి. ఇలా చేస్తే వీపు కోమలంగా తయారువుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: