తేనెలో కొత్తిమీర రసం కలిపి పెదవులకు రాస్తుంటే చలికాలంలో ఎదురయ్యే సమస్యలు తగ్గటంతోపాటు నల్లగా ఉన్న పెదవులు ఎర్రబడతాయి. బయటకు వెళ్లినప్పుడు వాతావరణంలోని కాలుష్యం చర్మానికి పట్టేస్తుంది.  కాబట్టి ఇంటికి వచ్చిన వెంటనే ముఖం, చేతులు శుభ్రం చేసుకోవాలి. నార్మల్ స్కిన్ కలిగిన వారు వారానికొకసారి స్ర్కబ్ చేయాలి. ఇలా చేస్తే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ రావు. మనం వాడుకునే కాస్మటిక్స్ బ్రాండెడ్వా కాదా చూసి కొనాలి, ఇవి చర్మానికి హాని కల్లించవు. ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి తప్పనిసరిగా ముఖాన్ని క్లైన్సర్ తో శుభ్రం చేసుకోవాలి.  జిడ్డు చర్మం గలవారైతే ఒకసారి అస్ట్రింజెంట్లతోనూ మరొకసారి క్లైన్సర్ తోనూ శుభ్రం చేసుకోవడం మంచింది. శరీరంలోని మలినాలను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. ఇందుకు వ్యాయామం సరియైన పద్దతి.   

మరింత సమాచారం తెలుసుకోండి: