మీరు ఇంటర్య్వూకు హాజరయ్యేటప్పుడు మేకప్ చేసుకోవాలా వద్దా ? అనేది పెద్ద సమస్య. నిజానికి సింపుల్ మేకప్ చేసుకుంటే చూసేవారికి మీకు కూడా బావుంటుంది. ఈసారి మీరేదైనా ఇంటర్వ్యూకు వెళ్తుంటే మేకప్ చేసుకునే ముందు ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. ముందు మాయిశ్చరైజర్ రాసుకోవాలి. తర్వాత మీ చర్మం రంగుకి మ్యాచ్ అయ్యే ఫౌండేషన్ రాసుకుని పౌడర్ రాసుకోండి. ఐబ్రోష్ పెన్సీల్ తో దిద్ది నాచురల్ కలర్ లిప్స్టిక్ వేసుకోవాలి. లిప్ స్టిక్ బదులుగా లిప్ గ్లాస్ లేదా లిప్ షైనర్ అయినా ఫర్వాలేదు. లిప్ స్టిక్ వేసుకోవడం రాకపోతే దాని జోలికి పోవద్దు. ఐషాడోలవీ : ఉపయోగించలనుకుంటే మెరుపులవి, డార్ఖ్ కలర్స్వి వద్దు. ఇంటుర్వ్యూకి హాజరయ్యేప్పుడు (మోడల్లింగ్లాంటి ఇంటర్వ్యు లు కానప్పడు) మీ మేకప్ వీలైనంత సింపుల్గా ఉండాలనుకున్నాం కాబట్టి ఐషాడె, ఐలైనర్ కి నో చెప్పండి. బ్లషర్ కూడా ఉపయోగించ వద్దు ఇంటర్వ్యూ రూంలోకి వెళ్లేముందు మీ దగ్గర చిన్న అద్దం ఉంటే మీ మేకప్ సరిగా ఉందో లేదో చూసుకోవచ్చు. బొట్టు పెట్టుకోవాలనా లేక పెట్టకుండా వదిలెయ్యాలా అనేది కూడాచాలా మందికి సమస్యే స్టిక్కర్ పెట్టే అలవాటుంటే దాన్ని మానక్కర్లేదు. రంగు రంగులు, తళుకులు, మెరుపులు కాకుండా చూసుకోంది. చేతికి ఒకటి రెండు గాజులు మరో చేతికి వాచి పెట్టుకుంటే చాలు. డ్రస్ విషయానికి వస్తే దుస్తులేవైనా నిండుగా డిగ్నిఫైడ్ గా ఉండేలా చూసుకోండి. మేకప్ కన్నా ఇంటర్వ్యూకి హాజరయ్యే వారికి హుందాతనం, ఆత్మవిశ్వాసం అవసరం. మొదట మీలో హుందాతనం ఆత్మవిశ్వాసంలను పెంపొందించుకోండి  

మరింత సమాచారం తెలుసుకోండి: