తయారీలో వాడే పధార్థాలు :  మీల్ మేకర్ : 50 గ్రాములు  అల్లం : పెద్ద ముక్క వెల్లుల్లి : 25 గ్రాములు  ఉప్పు : తగినంత సోయాసాస్ : 1 ½ టేబుల్ స్పూన్ పచ్చిమిర్ఛి : 7 లేక 8  అజినోమాలో : ½ టీ స్పూన్  వెనిగర్ : ఒకటీ స్పూన్  కొత్తిమీర : పెద్దకట్ట ఉల్లికాడలు : 25 గ్రాములు కార్న్ ఫ్లోర్ : ½ టీ స్పూన్

తయారీ ఎలా ?  ముందుగా మీల్ మేకర్ నీటిలో నానబెట్టండి ఆపై 8 నుండి 9 నిమిషాల వరకూ ఉడికించండి. ముందుగా మీల్ మేకర్ ను కాగిన నూనెలో వేసి తీయండి మిగిలిన నూనెలో పచ్చిమిర్చి, వెల్లుల్లి. అల్లం ముక్కల్ని వేయించండి.  ఆపై నూనెలోంచి తీసిన మీల్ మేకర్ ని వేయండి సరిపడినన్ని నీళ్లు (అరగ్లాస్) పోయాలి.

తర్వాత సోయాసాస్, వెనిగర్, అజినోమాటో కలిపి ఉడికించండి తగినంత ఉప్పు చల్లి కార్న్ ప్లోర్ ని కూడా (నీటిలో కలిపినది) వేసి, ఇంకిపోయే వరకూ కలపండి విడిగా వచ్చే వరకూ వేయించి ఉల్లికాడలు కొత్తిమీర చల్లండి. అంతే మీ నోరూరించే మంచూరియా సిద్దం అయినట్లే.  

మరింత సమాచారం తెలుసుకోండి: