కూలర్ కన్నా ఎయిర్ కండీషనర్ ని కొనేవారి సంఖ్య ఎక్కువ పెరుగుతోంది.  కాస్త డబ్బులు ఎక్కువపోయినా బెడ్రూమ్ వరకయినా ఎయిర్ కండీషనర్ చేయించుకోవాలన్న ఆలోచన   ఎక్కువ మందిలో కనిపిస్తోంది.   ఫ్యాను, కూలర్లతో పోల్చుకుంటే వీటి ఖరీదు ఎక్కువ. కనుక మీ ఎంపిక జాగ్రత్తగా ఉండాలి.

-      మార్కెట్ లో   వివిధ రకాల కంపెనీల ఎయిర్ కండీషనర్ దొరుకుతున్నాయి. కంపెనీలు తమ కండిషనర్ల ప్రత్యేకల గురించి అనేక అంశాలు చెబుతుంటాయి. ప్రచారం కూడా జాస్తిగా ఉంటుంది.  కానీ వాస్తవాలను పరిశీలించి తగిన దానిని ఎంపిక చేసుకోవాలి.

-      కొందరు ఇంటి మొత్తాన్ని ఎయిర్ కండిషనింగ్ చేయించుకోగలరు. కొందరు కేవలం రెండు లేదా ఒక పడకగదులకు ఎయిర్ కండిషనర్స్ ని కొంటారు.  కాబట్టి ధరలను కనుక్కొని స్థూలంగా  మీరు ఎంతలో కొనగలరో చూడాలి.

-      ధర ఎంతయినా ప్రమాణాల విషయంలో రాజీపడకూడదు.  ఎయిర్ కండిషనర్ సైజు, కూలింగ్ కెపాసిటి గురించి స్పష్టంగా కనుక్కొవాలి.  గది సైజుని బట్టి, గదిలోకి వచ్చే ఉష్ణోగ్రత తీవ్రతలను బట్టి ఎయిర్   కండీషనర్ సైజును ఎంచుకోవాలి.

-      ఎన్ని యూనిట్ల విద్యుత్ కాలుతోందో, ఎంత బిల్లు వస్తుందో కూడా అంచనా ఉండాలి. ఎక్కువ యూనిట్స్ కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవాలి. ఉష్ణోగ్రత తక్కువగా ఉన్న సమయంలో ఎక్కువ యూనిట్స్ కాలకుండా ఆటోమెటిక్గా సెట్ కాగల యంత్రాంగం కూడా ఎయిర్ కండీషనర్ లో  ఏ తీరున ఉందో కనుక్కోవాలి.  ఎయిర్ కండీషనర్ టెక్నాలజీలో అనేక మార్పులు వస్తున్నాయి.  కనుక ఇలాంటివి సాధ్యమే. ఒక వినియోగదారునిగా  మీ సందేహాలన్నుటిని తీర్చుకున్నాకే కొనాలి.

-      కొన్ని కండిషనర్లు ఎక్కువ శబ్దాన్నిస్తాయి.  కొన్ని తక్కువగా, ఉండీలేనట్టుగా ఉంటాయి.  కనుక ధ్వని తీవ్రత మోతాదు మించనరీతిలో ఉండే కండిషనర్ని ఎంచుకోవాలి.

-      ఎయిర్ కండీషనర్ కొనడానికి వెళ్లే ముందు అనుభవజ్ఞుల సలహా తీసుకోవాలి.  మీకు దగ్గరలో ఉన్న మిత్రుల ఇంట్లో ఉంటే వాటిని చెక్ చేసుకోవాలి.  వాళ్ళ ఇంట్లో ఎలా పనిచేస్తుందో అడిగి తెలుసుకోవాలి.

-      కొనడానికి షాప్ కి వెళ్ళాక వివిధ బ్రాండ్ల పనితీరు పరిశీలించారు.  దేనిమీద ఎంత డిస్కౌంట్ ఇస్తారో అడిగి తెలుసుకోవాలి.  ఎండాకాలం రాకముందే కొనడానికి ప్రయత్నిస్తే ధరలు తక్కువగా  ఉంటాయి.  ఇప్పుడు కొన్నా ఆయా కంపెనీల ఆఫర్లని గమనించండి.

ధర, డిస్కౌంట్ కాకుండా మీరు అనుకున్న ప్రమాణాలకి తగినట్టుగా ఉంటేనే కొనండి.

మరింత సమాచారం తెలుసుకోండి: