డబ్బు అనేది బందాలని కాలరాసి పూర్తిగా మనుషుల జీవితాల్లో ఒక భాగం అయిపొయింది. డబ్బు లేకపోతే ప్రపంచమే లేద అని అనిపించే స్థితి కి మానవజాతి ని తీసుకుని వచ్చేసింది డబ్బు. ఒక్క క్షణం కూడా ఎకౌంటు లో డబ్బులు తక్కువ ఉన్నాయి అనిపించుకుంటే అమ్మో అని భయపెట్టే పరిస్థితి వచ్చేసింది మనందరికే.


కానీ ఇలాంటి రోజుల్లో కూడా ప్రేమ కోసం ప్రేమించిన వ్యక్తి కోసం రూపాయ్ కాదు రెండు రూపాయలు కాదు కోట్లాది రూపాయలు వదులుకోవడం సాధ్యమేనా ? అది కూడా ఫేస్ బుక్ లో పరిచయం అయిన వ్యక్త్హి కోసం ..  సినిమాల్లోనే మనం ఇలాంటివి చూస్తూ ఉంటాం కానీ నిజజీవితం లో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారు అంటే వారికి దండం పెట్టడం తప్ప మనం ఏమీ చెయ్యలేము. మలేషియా లోని ఒక యువతి తన వారికి షాక్ ఇస్తూ వేలాది కోట్ల సామ్రాజ్యాన్ని కేవలం ప్రేమ కోసం వదిలేసుకుంది.


మలేసియాలో ఖూకే పెంగ్ బిజినెస్ టైకూన్. వేల కోట్ల రూపాయల వ్యాపారసామ్రాజ్యానికి అధినేత ఆయన, ఆయన భార్య మాజీ మిస్ మలేసియా పౌలిన్ ఛై. ఆ దంపతులకు ఐదుగురు సంతానం. అందర్లోకి చిన్న కుమార్తె ఏంజెలినా ఫ్రాన్సిన్ ఖూ, జెడిడియా అనే ఫ్యాషన్ డిజైనర్‌ ను ప్రేమించింది. చిన్నప్పటి నుంచీ ప్రేమగా పెంచిన కూతురు ని ఆస్తి లేని ఒక వ్యక్తికి ఇవ్వడానికి అతను అస్సలు ఒప్పుకోలేదు. అతన్నే పెళ్లి చేసుకునేలాగా అయితే తన ఆస్తి లో రూపాయి కూడా ఇవ్వను అని తెల్చేసాడు ఆ తండ్రి.


అయినా సరే నువ్వూ ఒద్దు నీ ఆస్తీ ఒద్దు అంటూ ఆమె పేరిట ఇప్పటికే రాసి ఉన్న దాదాపు ఐదు వేల కోట్ల ఆస్తిని వెనక్కి ఇచ్చేసి అతనికోసం వచ్చేసింది ఆమె. ఆమె పెళ్ళికి కేవలం ముప్పై మంది మాత్రమే హాజరు అయ్యారు. ఆమె తరఫువాళ్ళు ఎవ్వరూ రాకపోయినా ఆమె బాధపడలేదు. ఆమె జీవితం హాయిగా సాగిపోతుండగా, తన తల్లిదండ్రులు మధ్య విభేదాలు చోటుచేసుకోవడంతో వారు కోర్టు కెక్కారు. దీంతో న్యాయస్థానం విడాకులు మంజూరు చేసిన సందర్భంగా ఆస్తుల వాటాలు కోరింది.

మరింత సమాచారం తెలుసుకోండి: