తీపిపదార్థాల్లో ఒకడైన రవ్వలడ్డును పిల్లల నుంచి పెద్దలవరకు ప్రతిఒక్కరు ఎంతో ఇష్టంగా తింటారు. అయితే బయట మార్కెట్లలో కొనడం కంటే ఇంట్లోనే చేసుకుంటే ఎంతో మంచిది. రవ్వ లడ్డూ చిన్న పిల్లలు మరీ ఇష్టంగా తింటారు. అంతే కాదు ఇది తయారు చేసుకోవడం కూడా చలా సులభం. కొద్ది సమయంలోనే అయ్యే రవ్వలడ్డూ ఎలా చేసుకుంటారో తెలుసుకుందామా..!

కావాల్సిన పదార్ధాలు :

300 గ్రాములు బొంబాయి రవ్వ
250 గ్రాములు శనగపిండి (వేయించినది)
500 గ్రాములు పంచదార
50 గ్రాములు జీడిపప్పు
250 గ్రాములు నెయ్యి
ఒక చిప్ప ఎండుకొబ్బరి (కోరి వుంచాలి)
6-8 యాలకులు


- మిగిలిన నెయ్యిలో రవ్వను వేసి కొద్దిసేపటివరకు ఉడికించుకోవాలి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు రవ్వను వేయించిన అనంతరం దానిని పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ రవ్వ మొరుముగా వుంటే దంచుకోవాలి.

- బఇప్పుడు స్టౌ మీద మరో పాత్ర వుంచి.. అందులో కొంచెం నీళ్లు పోసి, పంచదారనూ కలిపి ఉడికించాలి. అది తీగపాకం వచ్చేంతవరకు కలుపుతూ వేయిస్తూనే వుండాలి.

- అనంతరం ఆ పాకంలో ఇదివరకు వేయించి పక్కన పెట్టుకున్న రవ్వ, జీడిపప్పు మిశ్రమాలతోబాటు శనగపిండి, ఎండుకొబ్బరి, యాలకులను కలిపి.. మొత్తం మిశ్రమాన్ని మిక్స్ చేస్తూ మీడియం మంట మీద వుండలుగా చేసుకోవాలి. అంతే! టేస్టీ రవ్వ లడ్డు రెడీ!





మరింత సమాచారం తెలుసుకోండి: