సూపర్ స్టార్ రజినీకాంత్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ‘లింగా’ ఫస్ట్ లుక్ వినాయక చవితి రోజున విడుదల కాబోతోంది అనే వార్తలు వస్తున్నాయి. ఈ సంవత్సరం డిసెంబర్ లో రజినీ పుట్టినరోజుకు విడుదల కాబోతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉండటంతో తమ సూపర్ స్టార్ ‘లింగా’ ఫస్ట్ లుక్ లో ఎలా ఉంటాడు అనే ఆత్రుతతో రజినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.  ఎటువంటి ప్రయోగాలు లేకుండా తన అభిమానులను దృష్టిలో పెట్టుకుని రజినీ తన సహజ సిద్ధమైన మాస్ లుక్ తో ఈ సినిమాలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో రజినీ స్వాతంత్య్రం ముందు, స్వాతంత్య్రం తర్వాత తరాలకు చెందిన రెండు పాత్రల్లోవిభిన్నంగా కనిపించబోతున్నాడు. ఈ వార్తలు ఇలా ఉండగా కర్నాటక రాష్ట్రంలో లింగా షూటింగ్ వివాదం రోజురోజుకు హాట్ న్యూస్ గా మారిపోతోంది. పర్యాటక నిషిద్ధ ప్రాంతమైన ప్రముఖ జలాశయం లింగనమక్కి వద్ద ‘లింగా’ షూటింగ్‌కు ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చింది అంటూ కొంతమంది పర్యావరణ అభిమానులు కోర్టుకు ఎక్కడమే కాకుండా లింగా సినిమా పై చర్యలు తీసుకోవాలని ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. శివుడు కుమారుడు వినాయకుడు ‘లింగా’ ను ఈ సమస్యల నుండి గట్టేక్కిస్తాడన్న ఆశతో ఈ సినిమా నిర్మాతలు వినాయక చవితి రోజున ఈ సినిమా ఫస్ట్ లుక్ ను తీసుకు వస్తున్నారని అనుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: