వయసు పెరుగుతున్నా కొద్ది ముఖంలో మార్పులు రావడం సహజమే. కానీ కొంతమందికి వయసు తో సంబంధం లేకుండా త్వరగా ముడుతలు పడుతాయి. దీంతో వారి మానసికంగా కుంగి పోతారు. సొసైటీలో తాము ఏజ్ బార్ గా కనబడుతున్నామనే ఫీలింగ్ లో ఉంటారు. మీ అందమైన శరీరం ముడతలు పడటం మొదలవటంతో, మీరు దగ్గరలోని కాస్మెటిక్ షాపుకు వెళ్ళి, చాలా ఖరీదైనన పరిహారాలను వెతుకుతారు. మీ శరీర అందాన్ని కాపాడుకోవాలనే ఆతురత మీకు ఉంటుంది. డోంట్ వర్రీ..! మీ ముఖంపై ముడుతలు కు నివారించడానికి ఈ పద్దతులు పాటించండి.

1. ఎండలో తిరగటం మానండి మీ చర్మం ముడతలు పడటానికి ప్రధాన కారణాలలో ఎండ కూడా ఒకటి. మీరు చేయవలసిందల్లా, సాధ్యమైనంతవరకు ఎండలో సమయం కేటాయించకుండా జాగ్రత్త పడండి. ఈ విషయాన్ని ధృవపరచటానికి చాలా సాక్షాధారాలున్నాయి. ఇలాంటి వాటిలో ఒకేవిధంగా ఉండే కవలలపై పరిశోధనలు జరిపి వెలువరించిన ఒక నివేదిక కింద తెలుపబడింది. న్యూయార్క్ ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్ ‘డారీఖ్ యాన్టేల్' ప్రకారం, ఎండ మన శరీరం మడతలు పడటానికి ప్రధాన కారణం. వంశపారంపర్య కారణాలకంటే, ఇదే ప్రధాన కారణమని ఆయన అంటున్నారు. ఇద్దరు కవలలో ఇంటిలో ఉన్నటు వంటి వాడికి, చర్మం మడతలు బయట తిరిగే వాడికన్నా తక్కువగా ఉన్నట్లు ఈ పరిశోధనలలో కనుగొనటం జరిగింది. 2. తెల్ల సొన ఇది మీకు వింతగాను మరియు ఇబ్బందిగాను అనిపించవచ్చు, అయితే, మీరు తెలుసుకోవాల్సిందేమిటంటే, దీని వలన మేలు కలుగుతుంది. కోడిగుడ్లలోని తెల్లసొనను తీసుకోండి. అయితే పసుపు భాగం ఇందులో కలవకుండా చూడాలి. సేకరించిన తెల్లసొనను మీ చర్మానికి మర్దన చేసుకోవాలి. దీనిని మీ చర్మంపై కనీసం పదిహేను నిమిషాల పాటు ఉండేటట్లు చూడాలి. ఆ తర్వాత గోరు వెచ్చని నీటితో చర్మాన్ని కడగాలి. 3. నిమ్మరసం మీ చర్మం ముడతలను పోగొట్టుటలో శక్తివంతమైన విధానం ఇదే అని చెప్పవచ్చు. ఒక నిమ్మకాయను తీసుకొని, రెండు బాగాలుగా కోసి, నిమ్మరసాన్ని ముఖం మీదున్నటువంటి ముడతల మీద రుద్దాలి. నిమ్మరసంలోని ఆమ్లం, మీ చర్మం ప్రకాశంగా కనిపించటానికి దోహదపడటమే కాకుండా, ముడతలను కూడా తగ్గిస్తుంది. నిమ్మకాయ వాసనను బాగా పీల్చుకోండి. ఇలా చేయటం వాళ్ళ మీ ఇంద్రియాలు పనితీరు పెరుగుతుంది.

4. మీ చర్మాన్ని ముడతలు పడకుండా చూడటంలో నిద్ర ప్రధాన పాత్ర పోషిస్తుంది. నిద్రపోయే సమయం మనిషి, మనిషికీ మారుతుంటుంది అంటే ప్రతి మనిషి నిద్రపోవటానికి కేటాయించే సమయం ఒకే విధంగా ఉండదు. అయినప్పటికీ ప్రతి మనిషి ఎనిమిది గంటలపాటు నిద్రపోవటానికి ప్రయత్నం చేయాలి. నిద్ర లేకపోవటం వల్ల హార్మోన్లు స్థాయిలలో మార్పులు కలిగి, ఒత్తిడికి గురి చేస్త్తాయి. అందుదువల్ల శరీరం ముడతలు పడటమే కాకుండా, శరీరంలో తాపం (వేడి) కలుగుతుంది. మీరు నిద్ర పోయే స్థితి లేదా విధానం కూడా చాలా ముఖ్యం. ప్రక్కకు ఒరిగి పడుకోవటం మరియు బోర్లా పడుకొని నిద్రించడం వలన గడ్డం, చెంప మరియు నోసటిమీద చారలు ఏర్పడుతాయి. అందువల్ల మీ చర్మం మరిన్ని ముడతలు పడకుండా చూడటానికి, వెల్లకిలా పడుకొని నిద్ర పోవటానికి ప్రయత్నం చెయ్యాలి. 5. పొగ త్రాగటం మానండి అన్ని ఆరోగ్య విషయాలకు సంబంధిచిన మాదిరిగానే, పొగత్రాగటం మీరు తప్పకుండా మానుకోవాలి. ఎక్కువగా సిగరెట్లు కాల్చే వారిలో చర్మం ముడతలు పడే అవకాశం, మామూలు వారిలో కంటే ఐదు రెట్లు ఎక్కువగా వుంటుంది. సిగరెట్టు తాగేటప్పుడు పెదవులపై ఒత్తిడి వలన మరియు కనుచూపు వంకరగా అవటం వలన చర్మం ముడతలు పడే అవకాశం ఉన్నది.

6. పండ్లు మరియు కూరగాయలు ఇతర వ్యాధుల నివారణలో వీటి పాత్ర ఎలా ఉంటుందో, అలాగే, చర్మం ముడతలు విషయంలో కూడా సమాన పాత్ర పోషిస్తాయి. తాజా పండ్లు మరియు కూరగాయలలో విటమిన్ ‘A' మరియు ‘D' లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తరచుగా తినటం వలన మీ శరీర అందాన్ని కాపాడుకోవచ్చు. తాజాగా ఉండే పండ్ల రసాన్ని మీకు దగ్గరలో ఉన్నటువంటి జ్యూసు షాపులో తీసుకోండి. లేదా మీ ఇంటిలోనే పండ్లరసాన్ని తయారు చేసుకోండి. మీకు యింకా సమష్యలు ఉన్నట్లయితే పోషకాహార ఆహార నిపుణులు లేదా చర్మ నిపుణుడిని సంప్రదించి తగిన జాగ్రత్తలను తీసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: