Directed by: Janardhan Maharshi
Starring: Shriya Sarana, Roja Selvamani, Sai Kumar

చిత్రకథ :  
పవిత్ర (హీరోయిన్ శ్రియ) తప్పని సరి పరిస్థితుల్లో వ్యభిచారిణిగా మారుతుంది, తను వేశ్యవృత్తిలో సంపాదించిన దానిలో అధిక మొత్తం చికిత్స చేయించుకోలేని స్థితిలో ఉన్న పేద కాన్సర్ రోగుల కోసం కాన్సర్ ఆసుపత్రికి ఇస్థుంది. ఈక్రమంలో ఒక చీటర్ శివ(శివాజి) ఆడవాళ్లను మోసం చేస్థూ, లొంగదీసుకుని అసభ్యర దృష్యాలను తీసి వారిని బ్లాక్ మెయిలింగ్ చేస్థున్న విషయం అతని వల్ల మోసపోయి ఆత్మహత్య చేసుకున్న యువతిని రక్షించి తెలుసుకుంటుంది. ఈ క్రమంలో ఒక రాజకీయనాయకుడు సుదర్శన్( సాయికుమార్) పవిత్రను తన కోడలిగా చేసుకుని రాజకీయల లబ్ది పొందాలని చూస్థాడు, వీటన్నింటిని చూసిన శ్రియ ఆడవారికి జరిగే అన్యాయాలకు చెక్ పెట్టాలనుకుంటుంది.  శ్రియ వ్యభిచారిణి గా మారటానికి గల కారణాలేమిటి…? తన తోటి ఆడవారిని మోసం చేసిన శివాజీకి ఆమె ఎలా బుద్ది చెపుతుంది...? ఆమె తన లక్ష్యాన్ని చేరుకుంటుందా...? దీని ద్వారా సమాజానికి అవసరమైన సందేశం ఏమిచ్చారు అనేది వెండితెరపై చూడాల్సిందేనటీ.  

Pavitra: Tweet Review || తెలుగు ట్వీట్ రివ్యూ || English Full Review

నటీనటులు:
సినిమాలోని తన పాత్రకు తగ్గట్టుగా శ్రియ రానించింది. పాత్ర వేశ్యదే అయినా చాలా పవిత్రంగా చూపెట్టడం, దానికి తగ్గట్టుగా నటించి శ్రియ సూపర్ అనిపించుకుంది. సినిమా అంతా హీరోయిన్ కథాంశమే కావడంతో ఎక్కడా కూడా దానిని చెడగొట్టకుండా శ్రియ తన స్థాయికి తగ్గట్టు రానించింది. మరో ప్రధానపాత్రలో సాయికుమార్ రాజకీయనాయకుడిగా పాత్రకు ప్రాణం పోసారు. డైలాగ్ డెలివరీ, నటన ఇలా అన్ని విభాగాల్లో సినిమాకు తగినంతగా చక్కగా నటించి శబాష్ అనిపించుకున్నారు. శ్రియ బాబాయి పాత్రలో ఏవిఎస్ దానికి తగ్గట్టుగా ఒదిగిపోయారు.  సర్వరోగ నిరోదానంద స్వామి పాత్రలో వచ్చిన రవిబాబు కూడా ఫర్వాలేదనిపించారు. ఇక సూపర్ కమెడియన్ బ్రహ్మానందం గూర్చి వేరే చెప్పక్కర్లేదు, ఆయన ఆయనే అనిపించుకున్నారు. సాయికుమార్ భార్యగా మూగ, చెవిటి దానిగా నటించిన రోజా సైతం పాత్రకు తగినంత ప్రాణం పోసారు.

సాంకేతిక వర్గం:
డైరెక్షన్ సినిమా కథకు తగ్గట్టగా లేదు అని పూర్తిగా అనకుండా, అలా అని సూపర్ అని కూడా అనకుండా ఉంది. కాని ప్రేక్షకులు సినిమా పై ఏరేంజ్ లో ఊహించుకుని వస్థారో అంతకంటే ఫర్వాలేదనిపించారు డైరెక్టర్. ఇక కథలో యండమూరి వీరేంధ్రనాథ్ చక్కటి సందేశాన్ని, సమాజానికి నేడు ఏది అవసరమో చెప్పి తన మార్కును చూపించారు. మాటలు బాగున్నాయి, ఆడది శీలం కాదనుకుంటే సిఎం కంటే పవర్ ఫుల్ ... ఇలా చాలా సన్నివేశాల్లో మంచి పవర్ డైలాగులు, మాటలు పెట్టి ఈ విభాగంలో సక్సెస్ అయ్యాడు. పాటలు బాగా లేవు, అశ్లీలం లేదు, స్క్రీన్ ప్లే కాస్తా స్లో గా ఉందనిపించింది. ఇక ఇది ఎంటర్ టైన్ మెంట్, కమర్షియల్, మాస్ యాంగిల్ లో తీసిన సినిమా కాదు కాబట్టి ఫైట్స్, విలన్లు, గగుర్పొడిచే సన్నివేశాలు లేవు.

విశ్లేషణ:
వ్యభిచారిణి ని పవిత్రంగా చూపడంలో తీసిన కథాక్రమం, అది నిజమే అని చెప్పే కథాంశం బాగుంది. నేటి సమాజంలో వ్యభిచారం కన్నా ప్రమాదకరమైన దాడులు ఆడవారిపై జరుగుతున్నాయని, ఆడదానిని అన్ని రకాలుగా వాడుకుంటున్న వైనాన్ని వివరించారు. వ్యభిచారిణి తన అవసరం కోసం తన దేహాన్ని మలినం చేసుకుంటుందే తప్ప మనసును కాదని చూపించారు. నేటి సమాజంలో ఆడవారిపై జరుగుతున్న అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టాలంటే ఏంచేయాలి అన్న సందేశాన్ని  ఇచ్చారు.

హైలెట్స్ :  

హీరోయిన్ వ్యభిచారిణిగా మారే క్రమంలో చూయించిన సెంటిమెంట్, వ్యభిచారణి అయినప్పటికి శ్రియను ప్రేమించడం, దానికి కారణాలు చూపడం. నేడు సమాజంలో ఆడవారిని ఎలా చూస్థున్నారు, వారిని ఎలా వినియోగించుకుంటున్నారు, వారికి రక్షణ, న్యాయం జరగాలంటే ఏంచేయాలి అని చూపించిన తీరు.

 చివరగా :   

 చాలా పవిత్ర హృదయంతో తీసిన సినిమా.


More Articles on Pavitra || Pavitra Wallpapers || Pavitra Videos

మరింత సమాచారం తెలుసుకోండి: