Star cast: Allari NareshSneha UllalKamna Jethmalani
Producer: Rama Brahmam SunkaraDirector: Anil Sunkara.



Action 3D - English Full Review


యాక్షన్ 3D రివ్యూ: చిత్రకథ

ఒబామా అలియాస్ ఓరుగంటి బాల మహేష్(సునీల్) ఒక హీరో, అతనికి కథ చెప్పడానికి వచ్చిన పోసాని కృష్ణమురళికి రివర్స్ లో ఓ రియల్ కథ చెప్పడం మొదలు పెడతాడు. కట్ చేస్తే బావ(అల్లరి నరేష్), అజయ్(కిక్ శ్యాం), పురుష్ (రాజు సుందరం), శివ(వైభవ్) లు చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. వీరిలో పురుష్ ఒక్కడికి తప్ప మిగతా వారంతా బ్యాచిలర్స్. వీరిలో అజయ్ కి శృతి(షీన)తో పెళ్లి కుదురుతుంది. దాంతో ఈ నలుగురు పెళ్ళికి ముందు గోవా వెళ్లి ఎంజాయ్ చెయ్యాలని గోవాకి బయలుదేరుతారు. మధ్యలో బావ గీత(నీలం ఉపాధ్యాయ్)ని చూసి ప్రమలోపడతాడు. కానీ ఆమె బావని రిజెక్ట్ చేస్తుంది. ఆ విషయాన్ని లైట్ తీసుకొని గోవా చేరిన వీరు జన్మలో మర్చిపోలేని విధంగా ఎంజాయ్ చెయ్యాలని అనుకుంటారు. ఫుల్ గా మందు తాగుతారు అందులో వీరికి తెలియకుండానే డ్రగ్స్ తీసుకోవడం వల్ల ఆ రాత్రి వీరికి తెలియకుండా చేసిన కొన్ని పనుల వల్ల చిక్కుల్లో పడతారు. పొద్దున్న లేచే సరికి నలుగురిలో ఒకడైన అజయ్ కనిపించడు. అజయ్ ఏమయ్యాడు? ఆ రాత్రి ఏం జరిగింది? ఆ రాత్రి వీళ్ళు చేసిన తప్పులేంటి దాని వల్ల వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలేంటి? చివరికి వాటన్నిటి నుంచి భయటపడ్డారా? లేదా? అనే విషయాన్ని మీరు తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.. 

యాక్షన్ 3D రివ్యూ: నటీనటుల ప్రతిభ

కామెడీ కింగ్ గా పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్ ఎప్పటిలానే తన నటనతో నవ్వించాడు కానీ ఈ మూవీలో కొత్తగా ఏమన్నా ట్రై చేసాడా అంటే మాత్రం నో అనే చెప్పాలి. ఈ సినిమాకి అల్లరి నరేష్ కంటే రాజు సుందరంని మెయిన్ హీరో అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అల్లరి నరేష్ కంటే ఎక్కువ అతనే నవ్విస్తాడు. సగం తెలిసి సగం తెలియని వాడు మధ్యలో దూరి గెలికేసి సందర్భాన్ని పిచ్చెక్కిస్తాడో అలానే దూరి గెలికేసి ప్రేక్షకుల్ని నవ్వించే పాత్రని రాజు సుందరం చేసాడు. ఆపాత్రకి రాజు సుందరం పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. వైభవ్ కాస్త ఎమోషనల్, కాస్త భయస్తుడిగా ఉండే పాత్ర చేసాడు, ఆ పాత్రకి న్యాయం చేసాడు. కిక్ శ్యాం పాత్ర సినిమాలో పెద్దగా లేకపోయినా ఉన్నంతవరకూ ఓకే అనిపించాడు. నీలం ఉపాధ్యాయ్ చేసిన నటన గురించి మాట్లాడకపోవడమే బెటర్ ఎందుకంటే చేసింది ఏమీ లేదు కాబట్టి, కానీ పాటల్లో తను విచ్చలవిడిగా చేసిన అందాల ఆరబోతకి మాత్రం బి, సి సెంటర్స్ ఆడియన్స్ ఫిదా అవుతారు. ప్రధానంగా 'ఊలాల్లా', 'స్వాతి ముత్యపు జల్లులలో' పాటల్లో హాట్ హాట్ గా కనిపించి ఆడియన్స్ కి మత్తెక్కిస్తుంది. నేనేమన్నా తక్కువ తిన్నానా అని రెచ్చిపోయిన స్నేహ ఉల్లాల్ 'డింగ్ డాంగ్ బెల్' సాంగ్ లో రెచ్చిపోయి అందాలు ఆరబోయడమే కాకుండా హిప్ షేకింగ్ మూమెంట్స్ తో ఆకట్టుకుంది. మిగతా హీరోయిన్స్ రెండు మూడు సీన్స్ కి మాత్రమే పరిమితమయినా వారి పాత్రలకి వారి నటన జస్ట్ ఓకే. అతిధి పాత్రలో మెరిసిన 'ఈగ' సుధీప్ తన నటనకి మరోసారి మంచి మార్క్స్ కొట్టేయడమే కాకుండా బట్లర్ ఇంగ్లీష్ తో కాసేపు నవ్వించాడు. ఎంఎస్ నారాయణ 'దూకుడు' సీక్వెన్స్ పరవాలేదనిపిస్తుంది. సునీల్, పోసానిల నటన ఓకే. బ్రహ్మానందం, మాస్టర్ భరత్ పాత్రలు సినిమాకి పెద్ద మైనస్.

యాక్షన్ 3D రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

సాంకేతిక విభాగం నటీనటులను పక్కనబెట్టాలి అలా పక్కన పెడితే సినిమాకి మెయిన్ హీరోస్ సినిమాటోగ్రాఫర్ సర్వేష్ మురారి మరియు స్టీరియోగ్రాఫర్ కీత్ డ్రైవర్. వీరిద్దరూ ఈ సినిమాకి ప్రాణం పోశారు అని చెప్పుకోవాలి. సినిమాలో 3డి ఎఫ్ఫెక్ట్స్ సింప్లీ సూపర్బ్. 3డిలో సినిమా తీయలనుకున్నప్పుడు డైరెక్టర్ అనుకున్న దాన్ని పర్ఫెక్ట్ గా చూపించే సినిమాటోగ్రాఫర్, స్టీరియోగ్రాఫర్ లేకపోతే దర్శకుడి కష్టం, నిర్మాత పెట్టిన డబ్బు అంతా బూడిదలో పోసిన పన్నీరులా అవుతుంది. కానీ ఈ సినిమా విషయంలో అలా కాలేదు. ఈ విషయంలో వారికి హాట్సాఫ్. కథ దాదాపు హాలీవుడ్ మూవీ 'హాంగ్ ఓవర్' నుంచి తీసుకుంది కాబట్టి పెద్దగా చెప్పుకునే కథ కాదు. స్క్రీన్ ప్లే టఫ్ గా లేకపోగా చాలా చోట్ల బోర్ కొట్టేలా రాసుకోవడంతో సినిమాకి బాగా డెబ్బడిపోయింది. డైలాగ్స్ కూడా జస్ట్ ఓకే. దర్శకుడిగా అనిల్ సుంకర సక్సెస్ అయినప్పటికీ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ విషయంలో మాత్రం ఫ్లాప్ అయ్యాడనే చెప్పాలి. మ్యూజిక్ ఓకే, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. డైరెక్టర్ కొత్త వాడైనప్పుడు ఎడిటర్ అన్నా కాస్త శ్రద్దగా ఎడిటింగ్ చేసుంటే సినిమాకి హెల్ప్ అయ్యేది. 

యాక్షన్ 3D రివ్యూ: హైలెట్స్

అల్లరి నరేష్, రాజు సుందరంలు నవ్వించడంలో సక్సెస్ అయితే నీలం ఉపాధ్యాయ్, స్నేహ ఉల్లాల్ అందాల ఆరబోతతో బి,సి సెంటర్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. తెలుగు ఆడియన్స్ కి కొత్త అనుభూతిని కలిగించే 3డి ఎఫెక్ట్స్, అలాగే 3డి ఎఫెక్ట్స్ లో తీసిన సాంగ్స్ సినిమాకి మెయిన్ హైలైట్స్.

యాక్షన్ 3D రివ్యూ: విశ్లేషణ

ఈ సినిమాకి రాసుకున్న కథని 'హాంగ్ ఓవర్' మూవీ నుంచి లేపడం వల్ల, ఆ సినిమాని ఇప్పటికే చాలా మంది చూసేసి ఉంటారు. అందువల్ల ఈ సినిమా చూసిన వారికి అస్సలు నచ్చదు, చూడని వారికి పరవాలేదనిపిస్తుంది. స్క్రీన్ ప్లే వీక్ గా ఉండడం, చాలా కామెడీ సీన్స్ అవుట్ డేటెడ్ గా అనిపించడంతో ఆడియన్స్ చాలా చోట్ల బోర్ ఫీలవుతారు. మొదటి అర్ధ భాగం బిలో యావరేజ్ గా అనిపించినా రెండవ అర్ధ భాగం ప్రీ క్లైమాక్స్ వరకూ బాగానే నడుస్తుంది. అక్కడి వరకూ ఆడియన్స్ కి వచ్చిన ఫీల్ ని క్లైమాక్స్ లో తుంచి సంచిలో వేసుకెళ్ళి మరీ హుస్సేన్ సాగర్లో పారేశారు. అక్కడక్కడా కామెడీ, ఆకట్టుకునే 3డి ఎఫెక్ట్స్ మరియు పాటల వల్ల ఫ్లాప్ కాకుండా ఎప్పటిలానే అల్లరి నరేష్ మినిమమ్ గ్యారంటీ సినిమాల్లో ఒకటిగా చేరిపోతుంది.

యాక్షన్ 3D రివ్యూ: చివరగా

అల్లరి నరేష్ సినిమా అంటే కామెడీ కోసమే వచ్చే ప్రేక్షకులు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఉండాలనుకుంటారు. ఈ సినిమాలో కామెడీని పూర్తిగా అందించలేకపోయినా, 3డి ఎఫెక్ట్స్ తో సంతృప్తిపరిచారు. కానీ 3డి ఎఫ్ఫెక్ట్స్ లేకపోయినా కామెడీ ఉంటే చాలు అనుకునే ప్రేక్షకులు ఎక్కువ ఉంటారు కాబట్టి కామెడీ మీద శ్రద్ధ తీసుకొని ఉంటే నిర్మాతకి నాలుగు రూపాయలు మిగిలేవి. యాక్షన్ 'యాక్షన్ 3డి' విత్ సూపర్ ఎఫెక్ట్స్ & యావరేజ్ ఎంటర్టైన్మెంట్.


Review board: Cheruku Raja, Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on Action 3D | Action 3D Wallpapers | Action 3D Videos

మరింత సమాచారం తెలుసుకోండి: