Star cast: Allari NareshSharmiela Mandre
Producer: Boppana ChandrasekharDirector: Devi Prasad

Kevvu Keka - English Full Review


కెవ్వు కేక రివ్యూ
: చిత్రకథ
 
మెజీషియన్ అయిన అబ్రకదబ్ర (కృష్ణ భగవాన్) కి మేనల్లుడు బుచ్చి రాజు . కళానికేతాన్ లో సేల్స్ మాన్ గా పని చేస్తుండే బుచ్చి రాజు మహాలక్ష్మి(షర్మిల మండ్రే ) ని ప్రేమిస్తాడు ఎలాగోలా మాయ చేసి మహాలక్ష్మి ని తన ప్రేమలో పడేస్తాడు . బాగా ఆస్తులున్న అల్లుడే కావాలనుకున్న సుబ్బారావు ( ఎం ఎస్ నారాయణ) కూతురు మహాలక్ష్మి ఈ విషయం తెలిసిన తరువాత బుచ్చి రాజు తనే కళానికేతన్ ఓనర్ లా నటించిన ఒకానొక సమయంలో దొరికిపోతాడు. సుబ్బా రావు ఇలా అయితే తన కూతురిని ఇచ్చి పెళ్లి చెయ్యను అనడంతో మరో ఆరునెలల్లో ఇలాంటి ఒక షాపింగ్ మాల్ కట్టి నీ కూతురిని పెళ్లి చేసుకుంటాను అని ఛాలెంజ్ చేస్తాడు బుచ్చి రాజు . ఆ ప్రయత్నాల్లో ఉన్న బుచ్చి రాజుకి మామ అబ్రకదబ్ర ద్వారా ఒక నిజం తెలుస్తుంది బ్యాంకాక్ లో పెద్ద బిజినెస్ మాన్ అయిన గొట్టం గోపాలకృష్ణ (ఆశీష్ విద్యార్ధి) గతంలో బుచ్చి రాజు తండ్రిని మోసం చేసి డబ్బులు కాజేసాడని తెలిసిన బుచ్చి రాజు ఎలా అయిన ఆ డబ్బు రాబట్టాలని నిర్ణయించుకుంటాడు . బ్యాంకాక్ వెళ్లి డబ్బులు గురించి అడుగగా గొట్టం గోపాల కృష్ణ బుచ్చి రాజుని బయటకి తోసేస్తాడు ఇక గొట్టం గోపాల కృష్ణ నుండి బుచ్చి రాజు డబ్బులు ఎలా రాబట్టాడు ? మహాలక్ష్మి ని పెళ్లి చేసుకున్నాడా లేదా అనేది మిగిలిన కథ...

కెవ్వు కేక రివ్యూ: నటీనటుల ప్రతిభ
తన కామెడీ టైమింగ్ తో మరియు పంచ డైలాగ్స్ తో ఎప్పటిలానే అల్లరి నరేష్ ఆకట్టుకున్నారు అంతే కాకుండా ఈ చిత్రంలో స్టైలిష్ గా కూడా కనిపించడం కొసమెరుపు . అందాల ఆరబోతలో మొదటి చిత్రంలో వంద మార్కులు కొట్టేసింది షర్మిల అంతే కాకుండా అమాయకపు పాత్రలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎప్పుడు విలన్ లా కనబడే ఆశిష్ విద్యార్థి పూర్తి స్థాయి కామెడీ పాత్రలో కడుపుబ్బా నవ్వించాడు . కృష్ణ భగవాన్ అలీ, ధనరాజ్ వంటి నటులు ఉన్నంతసేపు పరవలేధనిపించారు. ముఖ్యంగా మొదటి అర్ధ భాగంలో కొన్ని ఎపిసోడ్స్ చాలా అద్భుతంగా వచ్చాయి ఈ సన్నివేశాలకు టైమింగ్ చాలా ముఖ్యం ఇందులో ప్రతి నటుడు చాల బాగా నటించారు .

కెవ్వు కేక రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

పేరుకి కథ కథనం దర్శకత్వం అని మూడు విభాగాలు ఉన్నా ఒక్క డిపార్టుమెంటు కి కూడా సరిగ్గా న్యాయం చెయ్యలేకపోయాడు దేవి ప్రసాద్ ఎంతో మంది వాడి పాడేసిన కథని పట్టుకొచ్చి కొత్తగా చూపించాలని అదే పాత్ర ప్రయత్నం చేశాడు అలా చెయ్యాలంటే కథనం బాగుండాలన్న విషయాన్నీ ఈ దర్శకుడు మరిచిపోయాడు. కథ ఎక్కడో మొదలయ్యి ఎక్కడో ఒక చోట ముగించాలి కాబట్టి ముగించినట్టు ఉంటుంది. నవ్వుల నరేష్ ని తెర మీద చూపెడుతూ ప్రేక్షకులను నవ్వించడానికి నానా ప్రయాస పడ్డాడు కాని విజయం మాత్రం సాధించలేకపోయాడు. సినిమాటోగ్రఫీ చాల బాగుంది షర్మిల ను అందంగా నరేష్ ని స్టైలిష్ గా చూపించడంలో ఈ విభాగం పాత్ర చాలా ఉంది. మొదటి అర్ధ భాగంలో బాగానే పనిచేసిన ఎడిటర్ కత్తెర, రెండవ అర్ధ భాగానికి వచ్చేసరికి పదును తగ్గినట్టు కనిపిస్తుంది చాలా అనవసర సన్నివేశాలను అలానే ఉంచెశారు. ఇద్దరు సంగీత దర్శకులు అందించిన సంగీతం కూడా ఏదో ఉండాలి అంటే ఉండాలి అన్నట్టు ఉన్నాయి వాటి చిత్రీకరణ కూడా అంతతమాత్రం గానే ఉండటంతో తేలిపోయాయి. ఇక డైలాగ్స్ విషయానికొస్తే చిత్రం మొత్తంలో అక్కడక్కడ మాత్రమే సరిగ్గా పేలాయి మిగిలిన చోట తూతూ మంత్రంగా రాసినట్టు ఉంటాయి .


కెవ్వు కేక రివ్యూ: హైలెట్స్
  • నరేష్ కామెడీ టైమింగ్
  • ఫస్ట్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు
  • షర్మిల అందాలు

కెవ్వు కేక రివ్యూ: డ్రా బాక్స్
  • కథ , కథనం మరియు దర్శకత్వం
  • చిత్రంలో హాస్య నటులే కాని హాస్యం లేకపోవడం
  • అసలు ఆసక్తికరంగా లేని సెకండ్ హాఫ్

కెవ్వు కేక రివ్యూ: విశ్లేషణ

అల్లరి నరేష్ చిత్రం అంటే ఇలానే తీయాలని దర్శకులు ఫిక్స్ అయ్యారేమో తెలియదు కాని గమనిస్తే అయన అన్ని చిత్రాలు ఒకేలా ఉంటాయి ఎవరయినా ఇలా ఒకేలా ఉండే చిత్రాల లిస్టు తయారు చేస్తున్నట్టయితే ఈ చిత్రాన్ని అందులో జత చేసేయచ్చు. ఏ చిత్రం అయిన అదే రకం నటన కాబట్టి అన్ని చిత్రాలలో లానే నరేష్ తన పాత్రతో పాటు చిత్రాన్ని కూడా తన భుజాల మీద వేసుకొనే ప్రయత్నం చేసాడు. బ్లేడ్ బాబ్జి సినిమా హిట్ అయ్యింది కెవ్వు కేక అంటన్నారు ఇక దేవి ప్రసాద్ అల్లరి నరేష్ కాంబినేషన్లో చిత్రం సూపర్ గా ఉంటుంది అనుకుంటే పొరబడినట్టే. దర్శకుడు దేవి ప్రసాద్ చిత్రంలో నరేష్ ఉంటె చాలు కామెడీ అదే వచ్చేస్తుంది అనుకున్నట్టు కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ లో కథను గందరగోళంలోకి నెట్టిన అయన ప్రేక్షకులను అయోమయం పాలు చెసారు. తరువాత ఎం సన్నివేశం వస్తుందో తెలిసిపోయిన సగటు ప్రేక్షకుడికి తరువాత వచ్చే సన్నివేశం చాలా బాగుంటుంది అన్నట్టు చెప్పడం నిజంగా "కామెడీ" అనే చెప్పుకోవాలి. కామెడీ చిత్రం అని చెప్తుంటే చిత్రమంత కామెడీ ఉంటుందేమో కడుపుబ్బా నవ్వేసుకోవచ్చు అనుకున్న సగటు ప్రేక్షకుడికి కొన్ని కామెడీ సన్నివేశాలను మాత్రమే చూపెట్టి మోసం చేసాడు దేవి ప్రసాద్. కెవ్వు కేక అని పవన్ కళ్యాణ్ పాటను పేరుగా పెట్టుకోగానే ప్రేక్షకుల చేత కెవ్వు కేక అనిపించేస్తారేమో అనుకుంటే చిత్రంలో అప్పుడప్పుడు కెవ్వు కేక(బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్) అనడం తప్ప ప్రేక్షకులు ఒక్కసారి కూడా కెవ్వు కేక అనకపోవడం నిజంగా కెవ్వు కేక అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అతి వేగంగా చిత్రాలు చేస్తున్న అల్లరి నరేష్ ఇకనయిన తన టెంప్లేట్ మార్చుకొని కొత్త టెంప్లేట్ లోకి వెళ్తే మరి కొన్ని రోజులు ఆయనేం చేసిన హిట్ అయిపోద్ది ఈ టెంప్లేట్ ప్రేక్షకులకు బోర్ కొట్టేసిందని అయన గుర్తిస్తే చాలు. కామెడి కోసం అయితే ఈ చిత్రాన్ని చూడకండి కొత్తదనం కోసం అయితే అసలే వద్దు... లేదు నేను నరేష్ కి నేను వీరాభిమానిని ఖచితంగా చూస్తాను అంటారా మీరు నిజంగా కెవ్వు కేక ........


కెవ్వు కేక రివ్యూ: చివరగా
కెవ్వు కేక : తెర మీదే కాని తెరముందు నో కేకలు
 

Review board: Cheruku Raja, Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on Kevvu Keka | Kevvu Keka Wallpapers | Kevvu Keka Videos

మరింత సమాచారం తెలుసుకోండి: