Star cast: Naveen ChandraPiaa BajpaiNassar
Producer: M Sumanth Kumar ReddyDirector: Jeevan Reddy

Dalam - English Full Review

దళం రివ్యూ: చిత్రకథ 
శ్రుతిని చంపడానికి బయలుదేరిన అభి తన గతాన్ని చెప్పడం మొదలు పెట్టడంతో కథ మొదలవుతుంది. నక్సల్స్ దళంలో పని చేస్తున్న శత్రు(కిషోర్) మరియు అభి( నవీన్ చంద్ర) జనజీవన స్రవంతిలో కలిసిపోవాలని నిర్ణయించుకుంటారు. ఇదే విషయాన్ని నాయకుడు నాగబాబుకి చెప్పి పోలీసులకు లోంగిపోతారు. శిక్ష కాలంలో వాళ్ళలో ఉన్న చైతన్యాన్ని గమనించిన ఒక  పోలీస్ ఆఫీసర్ తను చెయ్యలేని పనులను వాళ్ళ చేత చేయించడానికి ఒప్పిస్తారు. ఇదిలా కొనసాగుతుండగా పొలిటికల్ లీడర్ అయిన జె కె (నాజర్) వాళ్లని స్వార్థపూరితంగా  ఉపయోగించుకుంటూ ఉంటారు.  ఇలా కథ నడుస్తుండగా వీరి గ్రూపులోకి శ్రుతి(పియ బాజ్పాయి) ప్రవేశిస్తుంది.  జె కె చెప్పిన ఒక పని కారణంగా ఇబ్బందుల్లో పడిన శత్రు దళానికి అదే సమయంలో కథలోకి వచ్చిన ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ లడ్డ(అభిమన్యు సింగ్) తో మరింత సమస్యలు వస్తాయి.  వారిని చంపేయాలని లడ్డ  - లడ్డని  చంపేయాలని శత్రు గ్యాంగ్ చేస్తున్న ప్రయత్నంలో ఎవరు గెలిచారు? అసలు శృతి ఎవరు? శ్రుతిని చంపాలన్న  నిర్ణయానికి అభి ఎందుకొచ్చాడు? అన్నది తెర మీద చూడవలసిందే......

దళం రివ్యూ: నటీనటుల ప్రతిభ
మంచి ఇంటెన్సిటీ ఉన్న పాత్రలో కనిపించిన నవీన్ చంద్ర ఈ పాత్రకు టైలర్ మేడ్ నటుడిలా కనిపించాడు. వినూత్నమయిన పాత్రలతో ఆకట్టుకునే కిషోర్ ఈ చిత్రంలో కూడా అలాంటి పాత్రనే పోషించి మెప్పించారు. రంగం చిత్రంలో అల్లరి పిల్లగా కనిపించి మెప్పించిన పియా బాజ్పాయి  ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించి ఇలాంటి పాత్రను కూడా బాగా హేండిల్ చెయ్యగలదు అని నిరూపించింది. ధనరాజ్, కృష్ణుడు మరియు తాగుబోతు రమేష్ చాలా బాగా నటించి ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అభిమన్యు సింగ్, హర్ష వర్ధన్ , నాగబాబు మరియు అజయ్ లు పాత్రల పరిధి మేరకు తమ వంతు న్యాయం చేశారు. సాయి కుమార్ పాత్ర బాగుంది, అయన నటన బాగుంది కాని దర్శకుడు సరిగా వాడుకోకపోవడం నిరాశ పరిచే విషయం

దళం రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

దర్శకత్వం కన్నా ముందుగా ఈ విభాగంలో మాటల గురించి చెప్పుకోవాలి. ఇలాంటి చిత్రాలకు మంచి ఇంటెన్సిటీ ఉన్న డైలాగ్స్ ఉండాలి లేకపోతే సన్నివేశంలో ఉన్న బలం మొత్తం పోతుంది.   ఆ విషయంలో దర్శకుడు జీవన్ రెడ్డి వందకు వంద మార్కులు కొట్టేసాడు. దర్శకుడిగా కూడా టేకింగ్ లో తొంబై మార్కులు సంపాదించుకోగా ...  స్క్రీన్ ప్లే విషయంలో మాత్రం జస్ట్ పాస్ అనిపించుకున్నాడు. ఫస్ట్ హాఫ్ వేగంగా మరియు వినోదాత్మకంగా నడిపిన జీవన్ రెండవ అర్ధ భాగం కి వచ్చేసరికి తేలిపోయాడు. సినిమాటోగ్రఫీ అద్భుతంగా ఉంది కొన్ని స్లో మోషన్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారు పాటలు పర్లేధనిపించిన సంగీత దర్శకుడు నేపధ్య సంగీతం విషయంలో చాలా జాగ్రత్త వహించినట్టున్నాడు ప్రతి సన్నివేశానికి తన నేపధ్య సంగీతంతో ప్రాణం పోశారు. ఎడిటర్ రెండవ అర్ధ భాగంలో కాస్త జాగ్రత్త వహించాల్సింది.


దళం రివ్యూ: హైలెట్స్
  • నవీన్ చంద్ర, కిషోర్ పెర్ఫార్మన్స్
  • ఇంటర్వల్ ముందు వచ్చే కామెడీ ఎపిసోడ్
  • ఇంటర్వల్ బ్లాక్
  • టేకింగ్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
  • సూపర్బ్ డైలాగ్స్

దళం రివ్యూ: డ్రా బాక్స్
  • క్లైమాక్స్ బాగున్నా ఊహించే విధంగా ఉండడం
  • సెకండాఫ్ అంత ఎఫ్ఫెక్టివ్ గా లేకపోవడం

దళం రివ్యూ: విశ్లేషణ

నక్సలిజం మీద చిత్రం అంటే పదునయిన కత్తితో ఆడుకోడం లాంటిదే ఎందుకంటే ఒక్క సన్నివేశంలో చిన్న తేడా వచ్చిన సెన్సార్ కి బలయిపోతుంది అటువంటి కాన్సెప్ట్ తో జీవన్ రెడ్డి ప్రేక్షకుల ముందుకు రావడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. గతంలో ఇలాంటి కాన్సెప్ట్ తో వచ్చిన " సింధూరం" చిత్రం తరువాత కొన్ని చిత్రాలలో నక్షలిజం గురించి ప్రస్తావించినా వారి జీవన శైలి గురించి మాత్రం చర్చించలేదు. మరి ఇలాంటి ఒక సున్నితమయిన అంశాన్ని ఎంచుకోవడం ఒక ఎత్తయితే అందులో ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ తో నింపడం దర్శకుడి ప్రతిభకు ప్రతీక. మొదటి సినిమాలో కాస్త అల్లరి పాత్రలో కనిపించిన నవీన్ చంద్ర నటనా పరంగా మంచి మార్కులు కొట్టేసాడు.

మొదట దర్శకుడు ఏదో చెప్పాలి అని మొదలు పెట్టి చివరకి ఎం చెప్పాలో మరిచిపోయాడో లేక చెప్పిన సెన్సార్ లో పోతుంది అనుకున్నాడో కాని కొన్ని సన్నివేశాలను డీల్ చేసిన విధానం చూస్తే అక్కడ ఆ సన్నివేశం కాకుండా ఇంకేదో ఉన్నట్టు అనిపిస్తుంది. స్లో మోషన్ సన్నివేశాలను అద్భుతంగా తెరకెక్కించారు. కొత్తదనం కావాలని కోరుకునే వాళ్ళకు ఈ చిత్రం కచ్చితంగా  నచ్చుతుంది.  ఫ్రెష్ ప్లాట్ లో తెరకెక్కించిన చిత్రం చివరి వరకు ఆ ఇంటెన్సిటీ మిస్ అవ్వకుండా తీశారు. మొదటి అర్ధ భాగంలో బాగున్నా స్క్రీన్ ప్లే కి రెండవ అర్ధ భాగంకి వచ్చేసరికి జబ్బు చేసింది తరువాత రాబోయే సన్నివేశాలేంటో ప్రతి ప్రేక్షకుడు చెప్పెయగలడు, పూర్తిగా పటుత్వం లేకుండా పోయింది. ఒక నక్సలిజం చిత్రానికి కావలసినంత ఇంటెన్సిటీ అయితే సృష్టించగలిగారు కాని చివరి వరకు ప్రేక్షకులలో ఇంట్రెస్ట్ సృష్టించలేకపోయారు.

జనజీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్ల జీవితాన్ని చాలా బాగా చూపించారు కాని రెండవ అర్ధ భాగం మీద కాస్త దృష్టి పెట్టి ఉంటె ఇంకా బాగుండేది. మొదటి అర్ధ భాగంలో తనదయిన శైలిలో డైలాగ్స్ తో ఆకట్టుకున్న సాయికుమార్ పాత్రను రెండవ అర్ధ భాగంలో చంపాల్సిన అవసరం ఎందుకొచ్చిందో దర్శకుడికే తెలియాలి. తమిళంలో డబ్బింగ్ చేస్తున్నారని కాబోలు క్లైమాక్స్ తమిళ చిత్రాలను తలపిస్తుంది. నటులు అందరు పాత్రలకు న్యాయం చెయ్యడం చాలా అరుదు ఈ చిత్రంలో అది జరిగింది.కొత్తదనం తో కూడిన కాన్సెప్ట్ వినూత్నమయిన టేకింగ్ సినిమాటోగ్రఫీ నటీనటుల పనితీరు అద్భుతమయిన డైలాగ్స్ కోసం ఒకసారి చూడవచ్చు ...


చివరగా: ఇంటెన్సిటీ కూడిన ఎంటర్టైనర్
 

Review board: Cheruku Raja, Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on Dalam | Dalam Wallpapers | Dalam Videos

మరింత సమాచారం తెలుసుకోండి: