Star cast: Vennela KishorePriyanka ChabraThagubothu Ramesh
Producer: Amarendhra Reddy PDirector: Gangarapu Lakshman

Athadu Aame O Scooter - English Full Review

అతడు..ఆమె.. ఓ స్కూటరు.. రివ్యూ: చిత్రకథ 
భీమవరంలో బి ఏ పాస్ అయిన గోవిందరాజు (వెన్నెల కిషోర్) ఏ పని చెయ్యకుండా  తన  ముత్తాతల నుండి వచ్చిన "స్కూటర్"ని వేసుకొని బలాదూర్ గా తిరుగుతుంటాడు. అలాంటి వాడికి తన కూతురిని ఇచ్చి పెళ్లి చెయ్యను అని గోవిందరాజు మామయ్య వేరేవాళ్ళకి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేస్తాడు.  దీంతో గోవింద రాజులుకి కోపం వచ్చి నీ కూతురికన్నా అందమయిన అమ్మాయిని పెళ్లి చేసుకొని నీ కన్నా ముందే మా అమ్మని నానమ్మను  చేస్తా అని శపధం చేసి హైదరాబాద్ చేరుకుంటాడు. అక్కడ అతడికి హీరోయిన్  పరిచయం అవుతుంది. లక్కి ( ప్రియాంక చాబ్ర) తో ప్రేమలో పడ్డ గోవిందరాజు ఆమెను  ఒప్పించి పెళ్లి చేసుకొంటాడు . కాని పెళ్లి తరువాత లక్కి గోవిందరాజులుకి  ఒక కండిషన్ పెడుతుంది, ఆ కండిషన్ ఏంటి ? గోవిందరాజు శపథంలో గెలిచాడా లేదా అన్నది మిగిలిన కథ.

అతడు..ఆమె.. ఓ స్కూటరు.. రివ్యూ: నటీనటుల ప్రతిభ
చిత్రంలో కామెడీ లేకపోవడంతో వెన్నెల కిషోర్ చెయ్యడానికి కూడా ఎం లేకుండా పోయింది, కొన్ని సన్నివేశాల వరకు బాగానే చేసాడు అనిపించాడు. మిగిలినవన్నీ ప్రేక్షకుడికి నేను నటిస్తున్నాను అని చెప్పడానికే చేసినట్టు ఉంటాయి . చెయ్యడానికి ఎం లేదు కాబట్టి తన అందాలను చూపెట్టి ఆకట్టుకోవాలన్న ప్రియాంక చాబ్ర  కొంతవరకు సక్సెస్ అయ్యింది. అక్కడక్కడ మాత్రమే నవ్విస్తాను అన్నట్టు తాగుబోతు రమేష్ పాత్ర వచ్చి వెళ్తుంది. ధనరాజ్ పర్వలేధనిపించాడు మిగిలిన అన్ని పాత్రలు గుర్తుంచుకోవడానికి కూడా కష్టం అనేలా ఉన్నాయి.

అతడు..ఆమె.. ఓ స్కూటరు.. రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

సినిమాలో నటీనటులు ఎంత చేసినా చేయకపోయినా సాంకేతిక విభాగంలో పనిచేసే ప్రతి ఒక్కరు కరెక్ట్ గా పని చేస్తే సినిమా దాదాపు హిట్ అయినట్టే. అలాంటి సాంకేతిక విభాగంలో ఈ సినిమా పరంగా చెప్పాల్సింది ఒక్క సినిమాటోగ్రాఫర్ గురించి మాత్రమే. అతనొక్కడే శ్రద్ధతో పనిచేసినట్టున్నాడు దాంతో విజవల్స్ ఓకే అనేలా ఉన్నాయి. సినిమాకి ప్రాణం అని చెప్పుకునేది కథ, ఈ సినిమాకి కథ రాసింది జగదీష్. ఈయన రాసిన కథ నేను లంగోటి వేసుకునే రోజుల నుంచీ చూస్తున్నదే, నా కన్నా సీనియర్స్ ఐతే ఇంకా ముందు నుంచే చూస్తూ ఉండొచ్చు ఇలాంటి కథల్ని. సినిమాని ఆడియన్స్ కి కనెక్ట్ చెయ్యాల్సిన స్క్రీన్ ప్లే కూడా ఈయనే రాశాడు. కథే బాగా రాయనప్పుడు స్క్రీన్ ప్లే మాత్రం బాగా రాస్తాడని ఎలా ఆశించగలం చెప్పండి. స్క్రీన్ ప్లేని కూడా గంగలో కలిపెసాడు. కథ స్క్రీన్ ప్లే సరిగ్గా లేకపోవడం వలనో కానీ డైరెక్టర్ సినిమాని అటు తిప్పి ఇటు తిప్పి ప్రేక్షకులకి చిరాకు పుట్టించాడు. ఎడిటర్ అయితే మరీ ఘోరం కత్తెరతో కొన్ని రీల్స్ కట్ చేస్తే రీల్ వృధా అయిపోతుందని అనుకున్నాడో ఏమో తెలియదు కానీ అస్సలు కత్తెరే పెట్టినట్టులేడు. ఇక డైలాగ్స్ ఎక్కడో మచ్చుకి ఒకటి రెండు బాగుంటాయి. పూర్వకాలంలో  రాజులు డబ్బులు విసిరితే ప్రజలు వేరుకునే వారట అలాగే ఆడియన్స్ కూడా ఆ ఒకటి రెండు డైలాగ్స్ ఎప్పుడొస్తాయా అని మనం ఎదురు చూడాలి.


అతడు..ఆమె.. ఓ స్కూటరు.. రివ్యూ: హైలెట్స్
  • హీరోయిన్ ప్రియాంక చాబ్రా గ్లామర్
  • ఒకటి రెండు కామెడీ సీన్స్

అతడు..ఆమె.. ఓ స్కూటరు.. రివ్యూ: డ్రా బాక్స్
  • కథ - స్క్రీన్ ప్లే
  • చేతకాని డైరెక్షన్
  • హీరోయిన్ నటన
  • కామెడీ సినిమాలో కామెడీనే లేకపోవడం

అతడు..ఆమె.. ఓ స్కూటరు.. రివ్యూ: విశ్లేషణ

కమెడియన్ హీరో కావాలనుకోవడంలో తప్పు లేదు కాని మొదటి చిత్రాన్ని జాగ్రత్తగా ఎంచుకోవాలి. కామెడీ చిత్రం అన్న బ్రమతో వెళ్ళిన ప్రేక్షకుడు చిత్రంలో కామెడి కోసం వెతుక్కోవాల్సి వస్తుందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. వెన్నెల కిషోర్ కి ఇంకా హీరో గా  చేసే సమయం రాలేదేమో అనిపిస్తుంది. మనకి రానివి ఎందుకు అని వదిలేయక దర్శకత్వంలో వేలెట్టి కరిపించుకున్న ఈ నటుడు తాజాగా హీరోగా మరి మరోసారి కరిపించుకోడానికి సిద్దమయ్యారు. దర్శకుడు ఎంచుకున్న కథ చూస్తే కిచిడి లా అనిపిస్తుంది కమెడియన్ ని హీరో గా చూపించాలి అనుకున్నప్పుడు కథతో సంబంధం లేకుండా కామెడీ తో కథనాన్ని నింపేయాలి.  ఈ విషయాన్నీ మరిచిపోయాడో లేక తను చేసిందే కామెడీ అనుకున్నాడో తెలియట్లేదు కాని దర్శకుడు దారుణంగా విఫలం అయ్యాడు. వెన్నెల కిషోర్, తాగుబోతు రమేష్ మరియు ధన రాజ్ లాంటి కమెడియన్స్ ని చేతిలో పెట్టుకొని నవ్వించడానికి ఇబ్బంది పడటం దర్శకుడి వైఫల్యానికి ప్రతి రూపం. పేరు విభిన్నంగా ఉంది కదా చిత్రం అలానే ఉంటుంది అనుకోని వెళ్ళకండి, ఇందులో పేరు మాత్రమే విభిన్నంగా ఉంటుంది. ఇంకా చెప్పుకోవాలంటే కామెడీ చిత్రంలో కామెడీ లేకపోవడమే విభిన్నం. పెద్ద చిత్రాల మధ్యన వచ్చి ఉంటె ఈ చిత్రం ఒకటుందని కూడా తెలిసి ఉండదే కాదు కాని ప్రస్తుతం సినిమా ప్రేమికులకు వేరే గతి లేకపోవడంతో ఇలాంటి చిన్న చిత్రాల వైపు కూడా చూస్తున్నారు. ఇదే ఊపులో ఈ చిత్రం ఎంత రాబట్టితే అంత లాభం.


అతడు..ఆమె.. ఓ స్కూటరు.. రివ్యూ: చివరగా
అతడు ఆమె ఒక అభాగ్య ప్రేక్షకుడు
 

Review board: Cheruku Raja, Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on Athadu Aame O Scooter | Athadu Aame O Scooter Wallpapers | Athadu Aame O Scooter Videos

మరింత సమాచారం తెలుసుకోండి: