Star cast: Charmy KaurRahulSaranya Nag
Producer: Venkata SureshDirector: Chandu

Prema Oka Maikam - English Full Review

ప్రేమ ఒక మైకం రివ్యూ: చిత్రకథ 
మల్లిక(చార్మీ) ఒక హై క్లాస్ వేశ్య(కాల్ గర్ల్). హైక్లాస్ వేశ్యగా ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా ఎంతో కంఫర్టబుల్ గా లైఫ్ ని గడుపుతున్న మల్లిక ఓ యాక్సిడెంట్ చేస్తుంది. ఆ యాక్సిడెంట్ చేసింది మరెవరినో కాదు లలిత్(రాహుల్) అనే ఓ పాటల రచయితని. ఈ యాక్సిడెంట్ వల్ల లలిత్ కి కంటి చూపు పోవడంతో మల్లిక తనని తనతో పాటు తన ఇంట్లోనే ఉంచుకొని ఎవరన్నా కళ్ళు ఇస్తే మళ్ళీ అతనికి చూపు తెప్పించాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. లలిత్ పరిచయంతో మల్లిక లగ్జరీ లైఫ్, డబ్బు కంటే మించిన లైఫ్ వేరే ఉందని తెలుసుకుంటుంది. అదే సమయంలో మల్లిక లలిత్ డైరీ చదువుతుంది దాని వల్ల మల్లిక లలిత్ - సింగర్ స్వాతి(శరణ్య) మధ్య ఉన్న ప్రేమ గురించి తెలుసుకుంటుంది. దాంతో లిత్ కి హెల్ప్ చెయ్యాలి అని నిర్ణయించుకున్న మల్లికా ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ఏమిటి? చివరికి లలిత్ - స్వాతి మధ్య ప్రేమ ఏమైంది? అనే విషయాన్ని తెరపైనే చూడాలి.

ప్రేమ ఒక మైకం రివ్యూ: నటీనటుల ప్రతిభ
నటీనటుల్లో హైలైట్ గా అనిపించేది సెకండాఫ్ లో వచ్చే జబర్దస్త్ ఫేం షకలక శంకర్ ది మాత్రమే. అతనే సెకండాఫ్ లో కాసేపు ఆడియన్స్ ని నవ్వించాడు. పోస్టర్స్ లో ఒక్క చార్మీని చూపిచి ప్రేక్షకులని థియేటర్ కి రప్పించుకున్నా సినిమాలో మాత్రం ఆమె ఉండేది చాలా తక్కువ టైం. చెప్పాలంటే ఆమెది ఓ గెస్ట్ రోల్ లాంటిది. ఉన్నంతలో ఆమె నటన ఒక అనేలా ఉంది. గ్లామర్ పరంగా బాగానే ఆకట్టుకుంది. సింగర్ పాత్ర చేసిన శరణ్య జస్ట్ ఓకే అనేలా ఉంది. రాహుల్ నటన అస్సలు బాగోలేదు. అతను ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఎమోషన్స్ సీన్స్ చాలా పేలవంగా చేసాడు. ఈ మధ్య సపోర్టింగ్ రోల్స్ లో బాగా పేరు తెచ్చుకున్న రావు రమేష్ మరోసారి అసలు ప్రాముఖ్యత లేని పాత్ర చేసారు. మిగతా సీనియర్ నటులను కూడా సరిగా వినియోగించుకోలేదు.

ప్రేమ ఒక మైకం రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

ఈ చిత్రానికి చందు దర్శకత్వం వహించారు అంటే "అవాక్కయ్యారా" అన్నంత అవాస్తవంగా ఉంటుంది. కథ మరియు కథనంలో ఎప్పుడు పరిపఖ్వత ఉండేలా చూసుకునే చందు ఈ సినిమా విషయంలో బేసిక్స్ కూడా మరిచిపోయినట్టుగా అనిపిస్తుంది. ఎన్నో పాత్రలు ఉన్నాయి కాని కథ ఎక్కడ? కథనంలో బలం ఎక్కడ? అన్న బేసిక్ విషయాలను మరిచిపోయరో లేదా పట్టించుకోలేదో కూడా తెలియట్లేదు. ఏదయినా పర్లేదు అనిపించారంటే అది ఒక్క డైలాగ్స్ విషయంలోనే, ఇక సంగీతం విషయానికొస్తే అసలు బాగోలేదు, సినిమాటోగ్రఫీ సంగీతానికి గట్టి పోటీ ఇచ్చి విజయం దక్కించుకుంది. పేరయితే వేయించుకున్నారు కాని ఈ సినిమాకి ఎడిటర్ లేదు అనిపించేలా ఉంటుంది ఆ పనితనం.


ప్రేమ ఒక మైకం రివ్యూ: హైలెట్స్
  • చెప్పడానికి ఏమి లేవు

ప్రేమ ఒక మైకం రివ్యూ: డ్రా బాక్స్
  • చెప్పేంత ఓపిక లేదు (దాదాపుగా అన్నీ)

ప్రేమ ఒక మైకం రివ్యూ: విశ్లేషణ

ప్రేమ ఒక మైకం చందు దర్శకత్వం లో చార్మీ అనగానే భారీగా కాకపోయినా కొద్ది మేరకు అంచనాలు నెలకొన్నాయి. సినిమాకు వెళ్లక ముందు ఏ ప్రేక్షకుడయిన ఆలోచించే విషయం ఇదే కాని థియేటర్ లో కి వెళ్ళిన ప్రేక్షకుడికి ఇటు చందు శైలి కనపడదు అటు చార్మీ కూడా కనపడదు. ఆసక్తికరంగా మొదలయిన చిత్రం మెల్లగా దారి తప్పి ఎటు వెళ్ళాలో తెలియక శుభం కార్డు చేరుకున్నట్టు అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాలను రాసుకొని అన్ని ఒకచోట చేర్చి చిత్రం అనేసరికి ప్రేక్షకుడికి మైకం వదిలిపోతుంది. 10th క్లాస్ మరియు నోట్ బుక్ వంటి చిత్రాలను తెరకెక్కించిన చందు ఇలాంటి చిత్రం తీస్తాడు అని అసలు ఊహించలేదు. పబ్లిసిటి విషయంలో పోస్టర్ మరియు ట్రైలర్ లలో చార్మీ తో నింపేసి చిత్రంలో మాత్రం కొద్దిసేపే చూపించడం ప్రేక్షకుడిని నిరాశ విషయం కరెక్ట్ గ చెప్పాలంటే పోస్టర్ లో చార్మీని చూసి వచ్చిన ప్రేక్షకుడిని మోసం చేశారు. ఇంకా పత్రాల గురించి చెప్పాలంటే ఇప్పుడు కనిపించిన పాత్ర ఎప్పుడు మాయం అయిపోతుంది అని చెప్పలేము. చాలా వరకు పాత్రలను పరిపూర్ణంగా అభివృద్ధి చెయ్యలేదు. అన్ని సన్నివేశం ముందే ఊహించేయవచ్చు . ఒకరి పేపర్ చూసి ఇంకొకరు కాపీ కొట్టారేమో తెలియట్లేదు కాని వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా అందరు ఫెయిల్ అయ్యారు. ఇంతకుమించి ఈ చిత్రం గురించి చెప్పుకోవడం వేస్ట్ . నా సలహా ఏంటంటే చార్మీ సినిమా అనుకోని వెళ్ళకండి, చందు దర్శకత్వం బాగుంటుందేమో అనుకుంటే అసలు వెళ్ళకండి ఏదో ఒక సినిమా చూడాలి అనుకుంటే వేరే సినిమాలు చూడండి...


ప్రేమ ఒక మైకం రివ్యూ: చివరగా
ప్రేమ ఒక మైకం : ఈ సినిమా ఒక నరకం
 

Review board: Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on Prema Oka Maikam | Prema Oka Maikam Wallpapers | Prema Oka Maikam Videos

మరింత సమాచారం తెలుసుకోండి: