Star cast: DileepSaikumar PampanaPriyanka
Producer: Ch.Kiran Kumar ReddyDirector: Subramanyam Pacha

Na Sami Ranga - English Full Review

నా సామి రంగా రివ్యూ: చిత్రకథ 
శీను (దిలీప్), రవి (సాయి) , శివ(శ్రీ తేజ్) మరియు రాణి రుద్రమ దేవి (ప్రియాంక) లు ఇంటర్ నుండి స్నేహితులుగా ఉంటారు. వీరిలో శీను మరియు రాణి ప్రేమలో పడతారు. వీరి ప్రేమకు రాణి తండ్రి కృష్ణ దేవరాయ ఒప్పుకోరు, ఇదిలా ఉండగా వీరి గ్యాంగ్ లోకి మాయ(యసస్విని) ప్రవేశిస్తుంది. కొన్ని సమస్యలతో సతమతమవుతున్న మాయ తన పరిస్థితిని శివకి చెప్తుంది. మాయని ఎలా అయినా కాపాడాలని నిర్ణయించుకున్న ఈ స్నేహితులు అనుకోకుండా మాఫియా డాన్ సలీం(ఆశీస్ విద్యార్ధి ) తో చిక్కుల్లో పడతారు. డాన్ సలీం నుండి తప్పించుకోడానికి ఈ గ్యాంగ్ పడ్డ పాట్లేంటి ? శివ రాణిల పెళ్ళికి కృష్ణ దేవరాయ ఒప్పుకున్నాడా?లేదా? అసలు మాయకి ఉన్న సమస్యలేంటి? అన్న సందేహాలుంటే తెర మీద జవాబు దొరుకుతుంది

నా సామి రంగా రివ్యూ: నటీనటుల ప్రతిభ
ఈరోజుల్లో ఫేం సాయి తన టైమింగ్ తో సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలను పరవలేధనిపించినా, కథలో ఉన్న 'బలం' మాత్రం అయన నటనను నీరుగార్చింది. ప్రియాంక మరియు యసస్విని అందంగా కనిపించాలన్న తాపత్రయంతో వారిద్దరూ హావభావాలు ఏమి చూపించలేదు. దిలీప్ మరియు శ్రీ తేజ ఏదో ఉన్నాము అనిపించారు. వీరిద్దరూ డైలాగ్స్ చెప్తుంటే ప్రేక్షకుడు చెవులు మూసుకోవాల్సి వచ్చింది మరీ అంత గట్టిగ ఎందుకు చెప్పారో(అరిచారో) వారికే తెలియాలి. పృథ్వీ మరియు జీవా పరవలేధనిపించారు. ఆశీస్ విద్యార్ధి జస్ట్ ఓకే.

నా సామి రంగా రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

దర్శకుడి నుండి మొదలెడితే దర్శకుడు పాత చింతకాయ పచ్చడి తయారు చెయ్యడం ఎలా అని నేర్చుకోడానికి ఈ చిత్రం తీసినట్టు తెలుస్తుంది. దర్శకుడిగా పచ సుబ్రహ్మణ్యం దారుణంగా విఫలం అయ్యాడు. బాల్ రెడ్డి అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది కానీ అగస్త్య అందించిన పాటలు వినడానికి మరియు చూడటానికి కూడా బాలేదు. ఒక్క ఐటెం సాంగ్ మాత్రమే పరవాలేదనిపించింది. డైలాగ్స్ కొన్ని చోట్ల బాగున్నాయి. ఎడిటర్ మరింత శ్రద్ద వహించుండాల్సింది. నిర్మాణ విలువలు చిన్న బడ్జెట్ సినిమా అనే ఫీలింగ్ రానివ్వలేదు.


నా సామి రంగా రివ్యూ: హైలెట్స్
  • ఏమీ లేవు

నా సామి రంగా రివ్యూ: డ్రా బాక్స్
  • మీకెన్ని కావాలో అన్ని ఉన్నాయి..

నా సామి రంగా రివ్యూ: విశ్లేషణ

నలుగురు స్నేహితులు - ఇద్దరు ప్రేమికులు - సమస్యతో ఒకమ్మాయి - వాళ్ళ జీవితాల్లోకి వచ్చే ఒక డాన్. ఈ లైన్ ఈ రివ్యూలో లేకపోతే చాలా సినిమా పేర్లతో కన్ఫ్యుస్ అయ్యేవారేమో కానీ ఇది ఈ లైన్ ఈ చిత్రానిదే, దీనికి కొసరుగా చివర్లో డాన్ మారిపోవడం. ముక్కలు ముక్కలుగా అతికించిన కామెడీ సన్నివేశాలు బాగానే ఉన్నా వీటన్నింటిని కలిపే పాయింట్ బలంగా లేకపోవడం ఈ చిత్రానికి పెద్ద మైనస్. ఇంకా దర్శకుడి లాజిక్ లు అయితే చెప్పుకోడానికి కూడా వింతగా అనిపించే లాజిక్ ఉదాహరణకు ఆయనేమో పెద్ద డాన్ కాని ఆయన్ని ఎవరు గుర్తు పట్టలేరు బహుశా సినిమాలో డాన్ అనుకున్నారేమో, వాళ్ళని చంపేస్తానని బెదిరిస్తున్న డాన్ నుండి పారిపోవడం కాదు కదా పరిపోవాలన్న ప్రయత్నం కూడా చెయ్యకపోగా డాన్ ని మార్చాలని అనుకోవడం....... అదండీ సంగతి ..... ఈ సినిమా మిమ్మల్ని చూడమని చెప్పడానికి మా దగ్గర ఒక్క కారణం కూడా లేదు ........ మీరు వెళ్ళాలనుకుంటే మీ ఇష్టం.


నా సామి రంగా రివ్యూ: చివరగా
ఆడియన్స్ కి చుక్కలే.
 

Review board: Cherukuri Raja, Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on Na sami Ranga | Na sami Ranga Wallpapers | Na sami Ranga Videos

మరింత సమాచారం తెలుసుకోండి: