Star cast: SrihariNeenu Karthika
Producer: Sujatha DeviDirector: Sadha

Police Game - English Full Review


పోలీస్ గేమ్ రివ్యూ
: చిత్రకథ
 
రాధా కృష్ణ(శ్రీ హరి) ఒక పవర్ఫుల్ మరియు ఎంతో నిజాయితీ కలిగిన పోలీస్ ఆఫీసర్ ఆతని నిజాయితీ అతన్ని ఒక్క చోట ఉండనివ్వకుండా పలు ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాడు. మరోవైపు రాష్ట్రంలో డ్రగ్ మాఫియా ఎక్కువ అయిపోయి యువత అంతా పెడదారిపడుతోంది. ఇందంతా చూసిన డిజిపి నాయుడు(కోట శ్రీనివాస రావు) తన మిత్రుడు మరియు ముఖ్యమంత్రితో కలిసి 'ఆపరేషన్ డ్రగ్ మాఫియా' ని మొదలు పెడతాడు. దానికి రాధా కృష్ణ ని స్పెషల్ ఆఫీసర్ గా అపాయింట్ చేస్తారు. ఒక నలుగు కుర్రాళ్ళు డబ్బు, డ్రగ్స్ కి అలవాటు పడి కొంతమంది రాజకీయ నాయకుల కింద ఈ డ్రగ్ బిజినెస్ ని చేస్తుంటారు. ఆ గ్యాంగ్ లో ఒకడైన కార్తీక్ రాధా కృష్ణ చెల్లెలైన సిరిని ప్రేమిస్తుంటాడు. అది తెలుసుకున్న రాధా కృష్ణ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు? కార్తీక్ రాధా కృష్ణకి సాయం చేసాడా? లేదా? రాధ కృష్ణ అనుకున్న ఆపరేషన్ ని సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసి డ్రగ్ మాఫియాని నాశనం చేసాడా? లేదా? చివరికి కార్తీక్ - సిరి ఒకటయ్యారా?లేదా అనేది మీరు థియేటర్ కి వెళ్తే చూడండి.

పోలీస్ గేమ్ రివ్యూ: నటీనటుల ప్రతిభ
ఈ సినిమాలో అందరి నటన మనకు చిరాకు తెప్పిస్తుంటే ఒక్క శ్రీ హరి గారి నటన మాత్రమే మనకు కాస్త ఊపిరి పీల్చుకునే ఇచ్చే రేంజ్ లో ఉంది. ఆయనొక్కరే ఈ సినిమాకి ప్లస్. ఆయన ఇలాంటి పాత్రలను ఇది వరకు చేయడంతో ఎంతో సునాయాసంగా ఈ పాత్రని చేయగలిగారు. చాలా రోజుల తర్వాత శ్రీ హరి సోలో హీరోగా చేసిన ఈ సినిమాలో ఆయన ఫైట్స్ చూడొచ్చు. హీరోయిన్ నీను కార్తీక అందాలను బాగా ఆరబోసి ఆకట్టుకున్నా నటన పరంగా మాత్రం జీరో మార్క్స్ సంపాదించుకుంది. సీనియర్ నటులైన కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం లను డైరెక్టర్ అసలు ఉపయోగించుకోలేకపోయాడు. ఇంకా చాలా మంది నూతన నటీనటులు ఈ సినిమాలో ఉన్నారు. వారి నటన గురించి మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.

పోలీస్ గేమ్ రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

ఒక సినిమాలో ఇది బాగాలేదు అది బాగాలేదు అని చెప్పుకోవచ్చు కాని ఈ సినిమాలో ఏదీ బాగాలేదు. సినిమాటోగ్రఫీ చాలా చీప్ గా ఉంది. స్టొరీ చాలా ఓల్డ్ గా ఉంది స్క్రీన్ ప్లే చాలా స్లో గా ఉంది ఎడిటింగ్ అసలు బాగాలేదు. స్టంట్స్ కూడా పెద్దగ ఆకట్టుకోలేదు అన్ని కలిపి ఒక మాటలో చెప్పాలంటే అందరు కలిసి ఫెయిల్ అయ్యారు.


పోలీస్ గేమ్ రివ్యూ: హైలెట్స్
  • ఉంటాయేమో అనుకోని థియేటర్ కి వెళ్ళడం.

పోలీస్ గేమ్ రివ్యూ: డ్రా బాక్స్
  • లేవని తెలిసేలోపు సినిమా అయిపోవడం

పోలీస్ గేమ్ రివ్యూ: విశ్లేషణ

సినిమా ఒక ఆశ ఒక కల ఒక ఆశయం కాని కొన్ని సినిమాలను చూస్తే ఇదా నేను ఊహించే కల? ఇదా నేను ఆశపడే ఆశయం? అనిపిస్తుంది ఈ చిత్రం అలాంటిదే శ్రీహరి లాంటి నటుడు ఉన్నా కూడా ఈ చిత్రంలో కాస్తయినా కామన్ సెన్స్ కనపడదు. ఒక లాజిక్ ఉండదు ఒక అనుభూతి ఉండదు ఎందుకు మొదలయ్యిందో తెలీదు ఎక్కడ ముగుస్తుందో తెలియదు పారిపోవాలనే ఆశను రెచ్చగొడుతూ సాగుతుంది ప్రతి సన్నివేశం కాని తీసుకున్న టికెట్ కి న్యాయం చెయ్యాలన్న ఆలోచన ఆపేస్తుంది ఇలా సగటు ప్రేక్షకుడిని చిత్ర హింస పెట్టిన ఈ సినిమా "చిత్ర" హింస అనే పదానికి నిలువెత్తు అర్ధం గా మారింది. దర్శకత్వం దారుణం స్క్రీన్ ప్లే దారుణం కథనం దారుణం చిత్రానికి వచ్చిన ప్రేక్షకుడికి కాస్తయిన అలుసు ఇవ్వకుండా చివరి వరకు చిత్ర వధకి గురి చేశారు. పేరు లో గేమ్ ఉంది కదా అని థియేటర్ కి వఛ్చిన ప్రేక్షకుడిని ఒక ఆట ఆడుకున్నారు, ఇంకా ఈ చిత్రం గురించి చెప్పుకోవడం అనవసరం శ్రీ హరి కి అభిమానులు ఉంటె అందులో మీరు ఒకరు అయితే వెళ్ళాలి అనిపిస్తే వెళ్ళండి.

చివరగా
పోలీస్ గేమ్ - బోరింగ్ గేమ్
 

Review board: Cherukuri Raja, Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on Police Game | Police Game Wallpapers | Police Game Videos

మరింత సమాచారం తెలుసుకోండి: