Star cast: KrishnuduRajiv Kanakala
Producer: PLN RajuDirector: K Srikanth

Sahasra - English Full Review


సహస్ర రివ్యూ
: చిత్రకథ
 
చింతపల్లి సంస్థానానికి రాజు, అధిపతి రుద్ర నరసింహ రాజు(రాజీవ్ కనకాల). వీరి వంశాచారం ప్రకారం ఆ ఇంటి ఆడవారు ఎప్పుడూ బయట ప్రజలకు కనపడరు. నరసింగ రాజుకి అందమైన భార్య ఉంటుంది, ఆమె పేరు మయూఖ దేవి(రేవ). ఆమె అందాన్ని ఒక్కసారన్నా చూడాలని ఆ ఊరి ప్రజలు అనుకుంటూ ఉంటారు. అలాంటి ఆలోచనే అదే ఇంట్లో పనిచేసే మూగవాడైన చిన్నప్ప(షఫీ)కి కలుగుతుంది. దొంగచాటుగా ఆమె అందాన్ని చూసిన చిన్నప్ప ఆమెని ఎలాగైనా అనుభవించాలనుకుంటాడు. ఆ విషయంలో చిన్నప్పకి ఓ అఘోరా సాయపడతాడు. కానీ చిన్నప్ప కోరిక తీరకుండానే మయూక దేవి చనిపోతుంది. దాంతో బాధపడుతున్న చిన్నప్పకి అఘోరా ద్వారా మయూక బతకాలంటే అప్పుడే పుట్టిన సహస్ర(శ్రీ ఐర) అనే అమ్మాయి ద్వారా బతికే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆ తర్వాత చిన్నప్ప మయూక దేవిని బతికించుకోవడానికి ఏమేమి చేసాడు? చివరికి చిన్నప్ప సహస్ర ద్వారా మయూకని బతికించుకొని తన కోరిక తీర్చుకున్నాడా? లేదా? అసలు మయూక ఎందుకు చనిపోయింది? అనే అంశాలు మీరు తెరపైనే చూడాలి.

సహస్ర రివ్యూ: నటీనటుల ప్రతిభ
యువరాజు పాత్ర రాజీవ్ కనకాలకి బాగా సెట్ అయ్యింది. ఒక సంస్థానానికి రాజు ఎలా ఉంటాడో, ఎలా బిహేవ్ చేస్తాడో అనేది చక్కగా పలికించాడు. అందమైన రాజు భార్యలానే రేవ కనిపించింది. అలాగే ఒక పాటలో బాగా గ్లామరస్ గా కనిపించింది. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో షఫీ బాగా చేసాడు. రవి ప్రకాష్, కృష్ణుడు జస్ట్ ఓకే అనేలా ఉన్నారు. సినిమాలో లీడ్ రోల్, టైటిల్ రోల్ పోషించిన శ్రీ ఐర చూడటానికి కొన్ని సీన్స్ లో ఒకే అనేలా ఉన్నా కొన్ని సీన్స్ లో మాత్రం అస్సలు బాలేదు. నటన అయితే అస్సలు బాలేదు. టైటిల్ రోల్ చేసే హీరోయిన్ నటన బాలేకపోతే సినిమా సగం గంగలో కలిసినట్టే.

సహస్ర రివ్యూ: సాంకేతిక వర్గం పనితీరు

సినిమాలో మొదటగ చెప్పుకోవలసింది ఆర్ట్ డైరెక్టర్ గురించి కొన్ని సెట్స్ చాలా అద్భుతంగా వేశారు . నేపధ్య సంగీతం పరవాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. అనవసర సన్నివేశాలను తొలగించడం మొదలు పెడితే రెండవ అర్ధ భాగం మాత్రమే విడుదల చెయ్యవలసి వస్తుంది అని ఫీల్ అయ్యాడేమో ఎడిటర్ గారు అసలా ఎక్కడ "కట్" చెప్పలేదు. కథ - పాతదే, కథనం - వెరీ స్లో, దర్శకత్వం - బాగాలేదు సంభాషణలు - పరవాలేదు ఇవన్నీ ఒక ఎత్తయితే విజువల్ ఎఫెక్ట్స్ - నేను చెప్పలేను.


సహస్ర రివ్యూ: హైలెట్స్
  • సెట్స్
  • మనం ఈ సినిమాకి 70/50/30 రూపాయలు పెట్టడం

సహస్ర రివ్యూ: డ్రా బాక్స్
  • అన్నీ ఉన్నాయి. అలాగే మన జేబు నుండి 70/50/30 రూపాయలు లాస్ కావడం కూడా.

సహస్ర రివ్యూ: విశ్లేషణ

ఈ చిత్రం గురించి మొదట వినగానే ఇలాంటి ఒక చిత్రం ఉందా అని ఆశ్చర్యపోయేవారి కోసమే ఈ విశ్లేషణ. ముందుగా డైరెక్టర్ అనగా దర్శకుడు, ఈయన కథ కోసం పెద్దగ కష్టపడలేదు మాంచి హిట్ సినిమా ఒక దాన్ని పట్టుకొని దాని తోలు వలిచి వేరే తోలు అతికించాలని ట్రై చేసాడు. కథనం అయితే రెండవ అర్ధ భాగం సినిమాకి ప్రాణం అని ఎవరో అన్న మాట వినేసి మొత్తం రెండవ అర్ధ భాగంలోనే చెప్పాలని అనుకున్నడేమో ఫస్ట్ హాఫ్ స్టొరీ నిల్, నటీనటులు హావభావాలు పరవలేధనిపిస్తున్నా ఎందుకు యాక్ట్ చేస్తున్నారో వారికయినా తెలుసా అన్న ప్రశ్న తలెత్తుతుంది. ఒక సినిమా అంటే 24 క్రాఫ్ట్స్ పని చెయ్యాలి అంటారు ఇన్ని క్రాఫ్ట్స్ ఉండగా ఇంతమంది పని చెయ్యగా ఒక్క సెట్స్ గురించి మాత్రమే పాజిటివ్ గ చెప్తున్నా అంటే సినిమా లో అద్భుతాన్ని మీరు గ్రహించచ్చు. హారర్ సినిమా అని చెప్పి ప్రేక్షకులకు టెర్రర్ చూపించారు ఒక మంచి సినిమాని చూసి అలంటి చిత్రం చెయ్యాలనుకోవడం మంచి విషయమే కాని మనకున్న బడ్జెట్ తో అలంటి సినిమా తీసేయలనుకోవడం అమాయకత్వం అలా తీస్తే జనం చూస్తారు అనుకోవడం మూర్ఖత్వం.. ఈ సినిమా గురించి తెలిసిన వాళ్ళు ఎలాగు వెళ్లరు తెలియని వాళ్ళు ఇంత చదివాకా మీకు ఏది అనిపిస్తే అది చెయ్యండి.

చివరగా
సహస్ర - హారర్ కాదిది ప్రేక్షకుడికి టెర్రర్.
 

Review board: Cherukuri Raja, Saraswathi Nikhil, Shashikant. Write to: editor@apherald.com
Call: +91-40-4260-1008

More Articles on Sahasra | Sahasra Wallpapers | Sahasra Videos

మరింత సమాచారం తెలుసుకోండి: