వింధ్యాచల పర్వత పరిసరాలలలో, మధ్యప్రదేశ్ లో, భారదేశపు లలాటరేఖ-లోకమాత నర్మదా నది పశ్చిమ వాహినిగా ప్రవహిస్తోంది. ఈ నది యొక్క విపుల ధీర గంభీర జలరాశి భూతలం పైగల పాప-తాప-సంకటాలను దూరం చేస్తుంది. కొండల మీద నుంచి కలకలారావంతో జలజలపారే నర్మదను "రేవా" అని కూడా పిలుస్తారు. ఈ ప్రవాహంలో నున్నటి గుండ్రని రాళ్లను బాణలింగాలంటారు."నర్మదలోని కంకర రాళ్లు కూడా ఉత్తేజశంకరులు" అని భక్త జనులు భావిస్తారు. అందువల్ల నర్మదను "శంకరీనది" అని కూడ పిలుస్తారు.


నర్మదానది ఒడ్డున దీని ధారలో నడుమగా ఒక విశాల ద్వీపం మీద శ్రీ శంకరభగవానుని పన్నెండు జ్యోతిర్లింగాలలో నాలుగవ జ్యోతిర్లింగం "ఓంకార అమలేశ్వరుడు" అనే పేరుతో ప్రసిద్ధికెక్కింది. అక్కడి ద్వీపం మహియు జలధార ఆకృతి "ఓం" ఆకారాన్ని పోలి ఉంటాయి. ఇది ప్రకృతి సహజంగానే అలంకృతమైంది. నర్మద చుట్టూ ప్రదక్షిణలు జరిపే యాత్రికులు తమనుతాము కృతార్ధులుగానూ, జ్యోతిర్లింగ దర్శనం వలం పవిత్రులుగానూ భావించుకుంటారు. ఇక్కడి నర్మదాతటం మరియు ఓంకార ద్వీపం యొక్క పరిసరాలు అతిరమణీయంగా ఉంటాయి. చచూసితీరవలసిందే, నయనాభిరామం అయిన ప్రకృతి సౌందర్యం, నర్మదానది ప్రక్కల గల కొండ చరియలలో గల ఇళ్ళు, అక్కడి గుడులు, జలధారలో గల కోటి తీర్ధం, చక్ర తీర్ధం  వంటి పెద్ద జలపాతాలు ఉన్నాయి. వీటిలో చేపలూ, మొసళ్ళూ కూడా ఉన్నాయి. ఓంకార ద్వీపంపై లతలు అల్లుకుని ఉన్న ఎన్నో ఘన వృక్షాలు కనిపిస్తాయి. వక్షాలపై కోతులు గుంపులుగా దర్శనమిస్తాయి. పక్షుల కలకలారావాలు వినవస్తుంటాయి. గుడిగోపురాలు మెరుస్తూ కనిపిస్తాయి. వాతావరణంలో సర్వత్రా "ఓం నమ శివాయ" అనే నినాదం వినిపిస్తూంటుంది. అలాంటి సుందర ప్రదేశంలో శంకర భగవానుడు ఓంకారేశ్వరుడు మరియు అమలేశ్వరుడు అనే పేర్లతో జ్యోతిర్లింగ స్వరూపునిగా పూజింపబడతున్నాడు. ఇక్కడ ప్రచారంలో గల కథలు ఇవి. 


మొదయ దావులు దేవతలను ఓడించారు. ఇంద్రాది దేవతలు చింతిల్లారు. దానవులు ముల్లోకాల్లో అల్లకల్లోలం సృష్టించారు. తిరిగి దేవగణం శక్తిని పొందాలనే ఉద్దేశంతో మహాదేవుడు తన దివ్యశ్కితతో జ్యోతిర్మయ ఓంకార రూపం దాల్చాడు. పాతళం నుండి ఆవిర్భవించి శంకరుడు నర్మదా నదీ తీరంలో లింగరూపంలో ప్రత్యక్షం అయ్యాడు. దేవతలు ఈ లింగాన్ని ప్రతిష్ఠాపించి తిరిగి శక్తిని పొందారు. అప్పుడు వీరు దానవుల వినాశనం చేసి, పోగొట్టుకున్న సామ్రాజ్యాన్ని తిరిగి పొందారు. ఓకార అమలేశ్వరుడి జ్యోతిర్లింగ స్థానంలో బ్రహ్మ మరియు విష్ణువు కూడా నివసించనారంభించాడరు. అందువల్ల నర్మదా తీరాన్ని బ్రహ్మపురి, విష్ణుపురి మరియు రుద్రపురి యొక్క త్రిపురాక్షేత్రం అయ్యింది. రుద్రపురిలో అమలేశ్వర జ్యోతిర్లింగం ఉంది.


తరువాత, పురాణ కాలంలోనే ఇంద్రకృపవల్ల యవనాశ్వపుత్రుడు అయిన మంధాత ఇక్కడ రాజయ్యాడు. శంకర భగవానుణ్ని నిష్టతో కొలిచాడు. అప్పుడు శివుడు ప్రసన్నుడైనాడు. ఓంకార జ్యోతిర్లింగపు జలహరి (ఆర్ఘ్యం) నుండి నర్మదా జలాలు కొండ దిగువకు ప్రవహించి పరిసరంలో జలహరి లోతుగా ఉండి, నర్మద నీరు నదా ప్రవహిస్తుంటుంది. ఈ నీటి యొక్క వృష్ఠ భాగంలో బుడగలు తేలినప్పుడల్లా శంకర భగవానుడు ప్రసన్నుడయ్యాడని భావిస్తారు. మంధాతరాజు ఈ పవిత్ర స్థానం తన రాజధానిగా చేసుకున్నాడు. ఈ తీర్ధస్థానానికి ఓంకార మంధాత అనే పేరు కూడా ఉంది. మంధాతరాజు వంశీయులు ఈ నాటికీ ఇక్కడ నివశఇస్తూ కనిపిస్తారు.


వింధ్య పర్వతం కూడా ఘోరతపస్సు చేసి ఓంకార అమరేశ్వరుణ్ణి ప్రసన్న చేసుకున్నది. ఫలితంగా వింధ్య ప్రాంతం బహు సుందరంగా ఉంటుంది. ఆగస్త్యుని వంటి ఎందరో మహామునులు ఈ ఓంకార అమలేశ్వర జ్యోతిర్లింగ స్థానంలో తపస్సు, సాధన చేశారు. ఆశ్రమాలు స్థాపించారు. చరిత్రలో ఈ తీర్ధ స్థానపు వైభవం ద్విగుణీకృతం అయింది. క్రీ.వె. 1063లో వరమారరాజు ఉదయాదిత్యుడు. అమలేశ్వర మందిరంలో నాలుగు సంస్కృత స్త్రోత్రాలను శిలాఫలకాలపై చెక్కించాడు. పుష్పదంతుని "శివమహిమా స్తోత్రం" కూడా ఇక్కడ శిలాలేఖన రూపంలో కనిపిస్తుంది.


ఓంకారేశ్వర దీపంపై మొదట ఆదివాసులుండేవారు. ఆ స్థానం కాళికాదేవిది. భైరవగణాలని పిలువబడే, శ్రీమాతా భక్తులు, యాత్రికులను చాలా బాధిస్తుండేవారు. వారిని పట్టి దేవికి బలి ఇస్తూ ఉండేవారు. ఇంకొంచెం దూరంలో దరియాయీనాథ్ అనే పేరుగల సిద్ధపురుషుడు అక్కడ స్థావరం ఏర్పరుచుకుని, ఆ భైరవ గణాల అత్యాచారాలను అరికట్టాడు. అప్పటి నుంచి మొదలు కొని యాత్రీకుల రాకపోకలు నిరాటంకంగా కొనసాగనారంభించాయి. ఆ తరువాత కూడా అక్కడ భిల్లుల రాజ్యం సాగింది. 1195 క్రి.వై.లో రాజా భారత్ సింహా చౌహాన్ భిల్లులను జయించి, ఆ ఓంకార మంధాత  వైభవాన్ని మరింత పెంచాడు. భారత సింహ చౌహాన్ యొక్క రాజమహలు నేటికి శిథిలావస్తలో కానవస్తుంది. భారత సింహ చౌహాన్ వారసులు నేటికీ - తమను "రాజులుగా" భావించుకుంటూ,ఈ ఓంకార ద్వీపంపై హక్కు జమాయించుకుని తిష్ఠవేసి ఉన్నారు.


రెండవ పీష్వా బాజీరావు ఇక్కడి పురాతన మందిర శిథిలాలను పునరుద్ధీకరించారు. పీష్వా తరువాత పుణ్యశీల అహల్యాదేవి హోల్కర్ ఈ ప్రాచీన తీర్థస్థానాలను మెరుగుపరిచింది. విశాళం, దృఢం మరియు సుందరమూ అయిన ఘాట్ లను నిర్మించి, ప్రత్యోకించి కోటిలింగార్చన విధానాన్ని ఆరంభించింది. ఇరవై ఇద్దరు బ్రాహ్మణులు చేతులలో పదముడు వందల రంధ్రాలుగల ఒక చెక్క బల్లను పట్టుకుంటారు. ఆ రంధ్రాలలో మట్టి శివలింగాలను చేసి, వాటిని పూజిస్తారు. పూజ తరువాత నర్మదా నదీ ధారల్లో విసర్జన చేశ్తారు. ఈ  కార్యక్రమం సంవత్సరం అంతా జరుగుతుంది.


ఓంకార మంధాత యొక్క శివతీర్ధం అతి రమణీయంగా ఉంటుంది. దీనిని గురించి శంకరాచార్యుల వారు తమ స్తోత్రంలో ఇలా వర్ణించారు.

కావేరికానర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ |

సదైవ మాంధాతృవురే వసంతం ఓంకార మీశం శివమేకమేడే ||

(తాత్పర్యం : సజ్జనోద్ధారణ చేసేటువంటి కావేరి మరియు నర్మదానది యొక్క సంగమస్థానంలో సదా నివసించే ఓంకార శివునికివే నా ప్రణామాలు)

ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఐదవది  శ్రీ వైద్య నాథుడు. క్షేత్ర ప్రాధాన్యత, చరిత్ర కొరకు ఈ లింక్ క్లిక్ చేయండి


మరింత సమాచారం తెలుసుకోండి: