Baadshah: Tweet Review || తెలుగు ట్వీట్ రివ్యూ || English Full Review

  ఇటీవల కాలంలో ‘బాద్ షా’ సినిమా సృష్టించిన సంచలనం మరే ఇతర సినిమా కూడా కలిగించలేదు. అంతటి సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ ‘బాద్ షా’ సినిమా ఎలా ఉందో చూద్దాం..! చిత్రకథ : భారతదేశంలో జరిగిన , జరగబోయే బాంబుపేలుళ్ళకు ప్రధాన సూత్రదారి, అంతర్జాతీయ ఉగ్రవాది సాధుబాయి. సాధుబాయి హాకాంగ్ వ్యవహారాలు, అర్థిక విషయాలు గత 20 ఏళ్ళుగా చూస్తూ సాధుబాయికి అత్యంత నమ్మకమైన అనుచరుడు బాద్ షా తండ్రి ముఖేష్ రుషి, కాని బాద్ షా సాధుబాయి మాఫియా సామ్రాజ్యాన్ని మొత్తం తన చేతిలోకి తీసుకొని అతన్ని అంతం చేయాలనే లక్ష్యంతో వెలుతుంటాడు. ఈ క్రమంలో బాద్ షా మీలాన్ లో ఉన్న కాజల్ వద్దకు వెళ్లాల్సి వస్తుంది. హీరోయిన్ వద్దకు వెళ్లిన పని ఒకటైతే ఆ సాన్నిహిత్యంలో బాద్ షా కాజల్ ప్రేమలో పడతారు. అసలు బాద్ షా ఎవరు?.. హీరోయిన్ కాజల్ కు బాద్ షా లక్ష్యానికి మద్య సంబంధం ఏమిటీ...? సాధుబాయి నమ్మకమైన అనుచరుని కుమారుడే అయిన బాద్ షా సాధుబాయిని అంతం చేయాలని ఎందుకు అనుకుంటాడు అనే అంశాలను వెండితెర పై చూడాల్సిందే.

advertisements


నటీనటుల ప్రతిభ : జూనియర్ ఎన్టీఆర్ బహుముఖ పాత్రలు పోషించి అన్నివర్గాలను మెప్పించాడు. మాఫీయాను ఎదురించే గట్స్ ఉన్న ఫైట్స్ తో మాస్ ను, డ్యాన్స్ తో యూత్ ను, హస్యంతో, వినసొంపైన డైలాగులతో టోటల్ గా అందర్నీ మెప్పించిన జూనియర్ ఎన్టీఆర్ ప్రదర్శన అదుర్స్. గత చిత్రం దమ్ములో దొర్లిన పొరపాట్లును సరిదిద్దుకుని, చక్కటి ప్రధర్శనతో అభిమానులను మెప్పించాడు. ఆయన నటనలో హైలెట్స్ ఏమిటంటే తాత ఎన్టీఆర్ పాటల సందర్భంగా అచ్చు తాతలానే డాన్స్ చేసి థియేటర్ లో కేకలు పెట్టించాడు. కరుడు కట్టిన మాఫియా డాన్ గా ప్రతిభను చూపుతూనే, ఆ మరుక్షణమే హీరోయిన్ వద్ద అమాయకమైన పాత్ర పోషించి వావ్ అనిపించాడు. తొలిసారి పోలీస్ పాత్రను పోషించడం ఈ సినిమాలో విశేషం. మోము నిండా అమాయకత్వంతో సమాజసేవ చేసే పాత్రతో కాజల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె కురిపించిన నవ్వులు నిజంగా హైలెట్స్. ఇక బ్రహ్మానందం కురుపించిన నవ్వులు మొత్తం సినిమాకే సెంటర్ ఎట్రాక్షన్ గా నిలిచింది. నటన, డైలాగులు, హావభావాలు అద్భుతంగా పండించారు. కలలో ఉండటం, ఆ సందర్భంగా బ్రహ్మానందం  కురుపించిన నవ్వులు జల్లులు చెప్పడం కన్నా చూడటమే బెటర్.   హర్రర్ సినిమాలు తీసే డైరెక్టర్ గా రివేంజ్ నాగేశ్వర్ రావు పేరుతో ఎమ్మెస్ కురుపించిన నవ్వుల పంట సూపర్. తనతో సినిమా తీసేందుకు హీరోతో కలసి ఆయన వద్దకు వచ్చిన కాజల్ తో జరిగిన కథాంశం అంతా కమనీయమే... చిత్ర దర్శకునిగా ఎలా నటించాలో చెప్పడానికి ప్రదర్శించిన వివిధ గెటప్ లు కడుపుబ్బ నవ్వించాయి. ఇక ప్రధాన పాత్రలు పోషించిన హీరోయిన్ తండ్రి నాజర్, బాబాయ్ తనికెళ్ళ భరణి, కాజల్ శిష్యునిగా వెన్నెల కిషోర్ తదితరులు సినిమాలో కురిపించిన కామెడీ అదరగొట్టింది. అతిథిపాత్రలో వచ్చిన హీరో సిద్ధార్థ్, నవదీప్ లు ఈ సినిమాకు ప్రత్యేకత. హీరో మహేష్ బాబు వాయిస్ ఓవర్ సినిమాకే ప్రత్యేక ఆకర్షణ.   సాంకేతిక వర్గం పనితీరు : ఫోటోగ్రఫీ చాలా బావుంది. సినిమాలో ప్రతి సన్నివేశం వెండితెర మీద చక్కగా కనిపించింది. ఎస్.ఎస్.థమన్ ఎన్టీఆర్ అభిమానులకు గుర్తుండిపోయే పాటలు ఇచ్చాడు. ‘సైరో... సైరో..’ ‘డైమండ్ గర్ల్’ ‘బంతి పూల జానకీ’ పాటలు వాటి చిత్రీకరణ అంతా మెచ్చుకునే విధంగా ఉన్నాయి. మాటలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ ప్రతి డైలాగ్ పంచ్ లా పేలింది. ‘పిచ్ నీదైనా.. మ్యాచ్ నాది’ ‘నాపేరు ఎన్టీరామారావు.. ఆ పేరుకే ఓ చరిత్ర ఉంది’ అంటూ పలు సన్నివేశాల్లో జూనియర్ ఎన్టీఆర్ నోటవచ్చిన పదునైన డైలాగులు బుల్లెట్లుగా దూసుకునిపోయాయి. ‘బంతి’ ఫిలాసఫీ పేరుతో ప్రతీ విషయాన్ని బంతితో పోల్చుతూ హీరోయిన్ మాటలు సూపర్బ్. ప్రతీమాట కౌంటర్ - ఎన్ కౌంటర్ లా అలా సాగిపోయాయి, ఒక విధంగా చెప్పాలంటే సినిమా అంతా ఒక ఎత్తు అయితే మాటలు మరోఎత్తు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే శ్రీను వైట్ల ఇప్పటివరకూ ఇండస్ట్రిలో తమకు ఉన్న ఇమేజ్ ను మరింత పెంచుకునే విధంగా చేశాడు. అయితే కథ ఇండియా, ఇటలీ, ఇండియా ప్రదేశాల్లో తిరుగుతూ, తెర మీద ఆరడజను విలన్లు కనిపిస్తూ ఉండటం ప్రేక్షకులను గజిబిజి చేస్తూ ఉంటుంది. అలాగే, ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు గతంలో వచ్చిన సినిమాలోని సీన్లను పోలి ఉన్నట్లు అనిపించినా మాటలు తుటాల్లా పేలుతూ మనల్ని సినిమాలో లీనం చేస్తాయి. హైలెట్స్ : జూనియర్ ఎన్టీఆర్ నటన, బ్రహ్మానందం, కాజల్ కురుపించిన నవ్వులు,  ఎమ్మెస్ పండించిన హాస్యం. పిల్లివారి పెళ్లి చిందులు పేరుతో ప్రదర్శించిన పాటలు    డ్రాబ్యాక్స్ :   హీరో పరిచయ సన్నివేశం, కొత్తదనం లేని కథ, అంతగా ఆకట్టుకోని హీరో గెటప్స్ విశ్లేషణ :    మొత్తం మీద సినిమా అన్ని వర్గాలను అలరించింది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకూ ఎవరికి కావాల్సిన దానిని వారికి ఈ సినిమా అందించింది. కథలో కొత్తదనం లేకపోయినా దానిని చిత్రీకరించిన తీరుతో ఇండస్ర్టీలో మరో హిట్ గా నిలిచిపోతుంది. ప్రారంభం, ముగింపు.. అసలు కధాంశం కరుడుగట్టిన మాఫియాను అంతం చేయడమే అయినా మాస్ గా, థ్రిల్లర్ గా పోకుండా ఎక్కువ శాతం కామెడీతో నడిపించి ఓ కొత్త తరహా సినిమా విధానానికి ఇది నాంది పలికింది. ఫైట్స్ భయం గొలిపే సెట్టింగులు, ఏం జరుగుతోందో అన్న ఆందోళనగా చూసే సన్నివేశాలతోనే ఇలాంటి సినిమాలు తీస్తే సక్సెస్ అవుతాయి అన్న భావనను ఈ చిత్రం తుడిపేసింది. ఉగ్రవాదం, మాఫియాలు ఎంతటి ప్రమాదాలను తెస్తున్నాయి. వాటిని అంతం చేయడంలో ప్రతీ పౌరుడు తన బాధ్యతను ఏ విధంగా నిర్వర్తించాలి అన్న విషయాన్ని తెలిపిన చిత్రమిది   చివరగా :   ‘బాద్ షా’ అందరికీ ‘లడ్డూ’ తినిపించింది.  Raja can be reached at: CherukuRaja@apherald.com Editor can be reached at: editor@apherald.com   

More Articles on Baadshah || Baadshah Wallpapers || Baadshah Videos


***The ratings and analysis of the above reviews do not reflect the opinion of the audience. It is merely the reviewer’s perception and has no connection with the box office collections whatsoever.

మరింత సమాచారం తెలుసుకోండి: