Back Bench Student: Tweet Review || తెలుగు ట్వీట్ రివ్యూ || English Full Review

  మధుర శ్రీధర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’. మహాత్ రాఘవేంద్ర, పియా బాజ్ పాయ్, అర్చన కవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం..!   చిత్రకథ :   కార్తీక్ (మహాత్), ప్రియాంక (అర్చన కవి) ఇంజనీరింగ్ చదువుకునేటప్పుడు ఫ్రెండ్స్. కొంతకాలానికి ప్రేమలో పడతారు. ఇంజనీరింగ్ ముగిసిన తరువాత ప్రియాంక తన తండ్రి కోరిక ప్రకారం అమెరికాలో ఎమ్మెస్ చేయడానికి వెళ్లుతుంది. 16 సబ్జెక్ట్స్ లో ఫెలయిన కార్తీక్ తన ప్రతిభతో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో మంచి ఉద్యోగం దక్కించుకుంటాడు. తనకు పరిచయం అయిన చైత్రతో సాన్నిహిత్యం పెంచుకుంటాడు. అయితే అమెరికా వెళ్లిన ప్రియాంక తన ఎమ్మెస్ పూర్తికాకుండానే కార్తీక్ కోసం ఇండియా తిరిగి వచ్చేస్తుంది. చైత్ర, ప్రియాంకల్లో ఎవరు కార్తీక్ ను దక్కించుకుంటారు..., ఎవరు త్యాగం చేస్తారు... అన్నదే చిత్ర కథాంశం. నటీనటుల ప్రతిభ : మహాత్ రెండు, మూడు సన్నివేశాల్లో ఆకట్టుకున్నా, ఈ చిత్రంలోని హీరో పాత్రకు అతను సూట్ కాలేదు. చూపులకు మహాత్ బాగున్నా అతని నటన మెప్పించదు. మాస్ మహారాజా రవితేజ చేసే పాత్రలను ‘ఆనంద్’ ఫేం రాజా పోషిస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రంలో మహాత్ తన పాత్రను పోషించిన తీరు అలా ఉంది. అర్చనా కవి, పియా బాజ్ పాయ్ పాత్రలకు పెద్దగా ప్రాధన్యం లేదు. గుత్తా జ్వాల సోదరి ఇన్సి కామెడీ పాత్రను పోషించింది. తెలుగు తెరకు మరో ‘గీతా సింగ్’ లభించింది. అలీ నవ్వించడానికి ప్రయత్నించాడు. మిగిలిన వారు తమ పాత్రల పరిధిలో నటించారు. సాంకేతిక వర్గం పనితీరు :   ఈ సినిమాలో ఫోటోగ్రఫీ బావుంది. ప్రతీ సీన్ ఆకట్టుకునే విధంగా కనిపిస్తుంది. సంగీతం ఫర్వాలేదు. పాటలు గుర్తుంచుకునే విధంగా లేవు. మాటలు సాధారణం గా ఉన్నాయి. కథ సాధారణంగా ఉంది. స్ర్కీన్ ప్లే చాలా స్లోగా సాగింది. పైగా తరువాత సీన్ లో ఏం జరుగుతుందో మనం సులువుగా ఊహించుకోవచ్చు. చిన్న కథను వినోదాత్మకంగా తీయాలనుకున్న దర్శకుడు తాను అనుకున్న విధంగా సినిమా తెరకెక్కించలేకపోయాడు. విశ్లేషణ :     ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ ఈ పేరు వినగానే అల్లరి పిల్లాడు కథ అని మనం అనుకుంటాం. అయితే ఈ సినిమా అలాంటిది కాదు. ఒక హీరో ఇద్దరూ హీరోయిన్లు ఉన్నారు కథా అని ఓ ప్రేమకథా చిత్రం అనుకుంటే అది మన పొరపాటు. అలీ, బ్రహ్మానందం ఉన్నారని తెగ నవ్విస్తారని అనుకుని ధియేటర్ లోకి వెళ్ళితే అంత కంటే తప్పు ఇంకొకటి లేదు. మల్టీ ఫెక్ల్స్ ల్లో ఆడని, మాస్ జనాలు చూడని సినిమా ఇది. చివరగా :   బ్యాక్ బెంచ్ స్టూడెంట్ కూడా ఈ చిత్రాన్ని చూసి సమయాన్ని, ధనాన్ని వృధా చేయలేనటువంటి సినిమా ఇది.  

More Articles on BB Student || BB Student Wallpapers || BB Student Videos


 

మరింత సమాచారం తెలుసుకోండి: