Back Bench Student:తెలుగు ఫుల్ రివ్యూ || Tweet Review || English Full Review

APHerald  ‘బ్యాక్ బెంచ్ స్టూడెంట్’ తెలుగు ట్వీట్ రివ్వూ viewers కు స్వాగతం.    10:18am : సినిమా ప్రారంభం అవుతూ బ్యాక్ గ్రౌండ్ లో కలర్ ఫుల్ ఇంజనీరింగ్  టెక్ట్స్  బుక్స్ చూపిస్తూ టైటిల్స్ పడుతున్నాయి. 10:24am : ఒక లవ్లీ బ్యాక్ గ్రౌండుస్కోర్ సన్నివేశంలో అర్చనకావి బ్యూటీఫుల్ గా కనిపిస్తుంది. 10:28am : అర్చనకావి ఆమె తండ్రి మద్య సంభాషణలు జరుగుతున్నాయి ఈ సన్నివేశం బాగుంది. 10:31am : ఒక ఫన్ని ర్యాగింగ్ సీన్ లో మహత్ రాఘవేంద్ర తెర పై బాగున్నాడు. 10:41am : గుత్తాజ్వాల చెల్లిలు ఒక కామెడీ సన్నివేశంలో బొద్దుగా లావుగా కనపడుతుంది. 10:46am : చిత్రంలో మొదటి సాంగ్ ఇంజనీరింగూ... అంటూ ఏదో ఫీలింగ్... అనే సాంగ్ వస్తుంది. థియేటర్ లో ప్రేక్షకుల విజల్స్ తో మారుమోగుతుంది. మహత్ సాదాసీదాగా కనిపిస్తూ కాలేజ్ రోజులు గుర్తికువచ్చే విధంగా సన్నివేశాలు జరుగుతున్నాయి.  10:48am : పాట పూర్తి కావడంతో కావి- మహత్ ప్రేమలో పడుతుంది. 10:51am : లవ్ స్టోరీతో సాగే ఈకథ నెమ్మదిగా సాగుతుంది. మహత్-కావ్యల మధ్య సంబాషణలు జరుగుతన్నాయి. 10:54am : మహత్ వాయిస్ బాగోలేదు. పైగా డైలాగ్ డిలవరీ కూడా హార్టుఫుల్ గా లేవు. దీంతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాడు. 10:56am : మహత్-కావ్యల మద్య ప్లాష్ బ్యాక్ సన్నివేశాలు వస్తున్నాయి. 11:01am : 16 backlogs ఇంజనీరింగ్ లో ఉన్నాయని మహత్ గర్వంగా ఫీలవుతున్న సీన్ బాగుంది. 11:06am : ‘జగడ.. జగడ...జగడం’ అనే సాంగ్ వస్తుంది. మహత్  డ్యాన్స్ బాగుంది. సింభూ వాయిస్ కూడా బాగుంది. థియేటర్ లో ప్రేక్షకులు క్లాప్స్ కొడుతూ ఉత్సాహాంగా ఉన్నారు. 11:10am : Piaa బాజ్ పాయ్ చిన్న ఫైట్ సీన్ లో సహజంగా కనిపిస్తున్నాడు.   11:12am : సినిమాలో ఆశ్యర్యకర సన్నివేశాలు లేకుండా సాఫీగా సాగుంది. 11:32am : ‘వెన్నెలమ్మ నీతో జాబిలమ్మానీతో’ అనే సాంగ్ వస్తుంది. Piaa బాజ్ పాయ్, మహత్ ల జంట వైజాగ్ బీచ్ లో అందంగా కనబడుతున్నారు.                                                                                                                                     విశ్రాంతి: 11:41am : Piaa బాజ్ పాయ్ ను సాఫ్ట్ క్యారెక్టర్ లో చూపించడం బాగుంది. 11:45am : ‘ఐయామ్ సారీ వినురా నీతోనీ గొడవ’ అనే సాంగ్ వస్తుంది. Piaa బాజ్ పాయ్ ఫన్నిగా యాక్ట్ చేస్తూ కూల్ గా కనిపిస్తుంది. 11:51am : ప్రాజెక్ట్ మెనేజర్ గా [అలీ] నో దివాకర్ పరిచయ సన్నివేశం థియేటర్ లో నవ్వులపువ్వులను పూయిస్తుంది. మహత్ ఉద్యోగ ప్రయత్నం లో వస్తున్న సన్నివేశం వాస్తవం అనిపించే విదంగాలేదు. 12:14pm : మహత్ సాఫ్టువేర్ ఉద్యోగం వస్తుంది. ఈ సన్నివేశం గత చిత్రాలలోని సన్నివేశాలను పోలివున్నట్లు అనిపిస్తుంది. 12:18pm : మహత్-Piaa బాజ్ పాయ్ ల మద్య లిప్ లాక్ సీన్ వస్తుంది. ఇక్కడ చిత్రంలోని ’తెలిసి తెలిసి నీవల్లే’ సాంగ్ వస్తుంది. సమాజానికి సందేహం ఇచ్చినట్లు అనిపిస్తుంది. 12:22pm : మహత్-Piaa బాజ్ పాయ్ ల మద్య మనస్పర్ధలు వస్తున్నాయి. 12:32pm : కామెడీ కింగ్ బ్రహ్మి పరిచయ సన్నివేశం కన్ ప్యూజ్ కరీనాకపూర్ గా కనిపిస్తున్నాడు. 12:38pm : బ్రహ్మి నుంచి ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో హస్య సన్నివేశాలు రావడంలేదు. 12:50pm : ప్రాక్టికల్  సీన్ తో క్లైమాక్స్ అయిపోయింది. బ్యాక్ బెంచ్ టైటిల్ సాంగ్ తో సినిమా శుభం కార్డు పడింది.                                      

More Articles on BB Student || BB Student Wallpapers || BB Student Videos


 
 

మరింత సమాచారం తెలుసుకోండి: