2012 :     హీరో  |  హీరోయిన్  |  సినిమా | దర్శకుడు  |  సంగీతం  |  విలన్  |  కామెడీ

ప్రపంచ స్థాయి సాంకేతికతతో, అనుభవజ్ఝులైన జర్నలిజం మిత్ర బృందంతో, తాజా, సంచలన వార్తా విశ్లేషణలతో... ప్రారంభించిన అనతికాలంలోనే తన కంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్న ఎపిహెరాల్డ్.కామ్ పోర్టల్, వెబ్ జర్నలిజం రంగంలో మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోటి ఇరవై లక్షల మంది తెలుగువారిని  పోర్టల్ [ఎపిహెరాల్డ్.కామ్] ద్వారాను, సోషల్ నెట్ వర్కింగ్ [ఫేస్ బుక్, ట్విట్టర్] తోనూ అనుసంధానిస్తూ నిర్వహించిన అన్ లైన్ సర్వే తెలుగు వెబ్ జర్నలిజం చరిత్రలోనే సరికొత్త విధానంలో సాగింది. ఉత్తమ నటి విభాగంలో శృతిహాసన్, కాజల్, తమన్నా మొదలగు వారిని కాదని, టాలీవుడ్  బంగారుబాతు సమంతకే ‘‘2012 ఉత్తమ నటి’’ కిరీటాన్ని సినీ అభిమానులు అలంకరించారు. సర్వే వివరాలు: ఉత్తమ నటి      సమంత ‘ఏం మాయ చేశావే’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సమంత,  అప్పట్నుంచి ప్రేక్షకులను మాయ చేస్తూనే ఉంది. తన అందంతో కుర్రకారు హృదయాలకు వలవేసే సమంత, ‘ఈగ’ సినిమాలో తన అభినయంతోనూ అందర్నీ విశేషంగా ఆకట్టుకుంది. నటించిన ప్రతి సినిమాతోనూ హిట్ సాధిస్తూ ‘గోల్డెన్ లెగ్’ గా అభిమానుల నుంచి కితాబు అందుకుంటున్న ఈ మళయాళి కుట్టి 2012 ఏడాది మేటి నటిగా ఎన్నికయ్యింది.   శృతిహాసన్ కమల్ హసన్ కుమార్తె శృతిహాసన్ నటన తన రక్తం లోనే ఉందని నిరూపించుకుంది. గబ్బర్ సింగ్ సినిమాతో తన కెరీయర్ లో తొలి హిట్ దక్కించుకున్న శృతిహాసన్ అదే సినిమాతో 2012లో రెండవ ఉత్తమ నటిగా ఎన్నికయ్యింది. పవన్ కు జోడీగా మెగా అభిమానులను అలరించిన శృతిహాసన్ ఉత్తమ నటి జాబితాలో రెండవ స్థానం దక్కించుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: