2012 :     హీరో  |  హీరోయిన్  |  సినిమా | దర్శకుడు  |  సంగీతం  |  విలన్  |  కామెడీ

ప్రపంచ స్థాయి సాంకేతికతతో, అనుభవజ్ఝులైన జర్నలిజం మిత్ర బృందంతో, తాజా, సంచలన వార్తా విశ్లేషణలతో... ప్రారంభించిన అనతికాలంలోనే తన కంటూ ఓ ప్రత్యేకతను సృష్టించుకున్న ఎపిహెరాల్డ్.కామ్ పోర్టల్, వెబ్ జర్నలిజం రంగంలో మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోటి ఇరవై లక్షల మంది తెలుగువారిని  పోర్టల్ [ఎపిహెరాల్డ్.కామ్] ద్వారాను, సోషల్ నెట్ వర్కింగ్ [ఫేస్ బుక్, ట్విట్టర్] తోనూ అనుసంధానిస్తూ నిర్వహించిన అన్ లైన్ సర్వే తెలుగు వెబ్ జర్నలిజం చరిత్రలోనే సరికొత్త విధానంలో సాగింది. ఈ సంవత్సరం ఇబ్బడి - ముబ్బడిగా [దాదాపు 166 కు పైగా] సినిమాలు విడుదల కాగా, వాటన్నింటిని తోసిరాజని సినీ అభిమానులు ‘గబ్బర్ సింగ్’ నే 2012 ఉత్తమ తెలుగు సినిమాగా ఎన్నుకొన్నారు.     సర్వే వివరాలు : ఉత్తమ చిత్రం : గబ్బర్ సింగ్     గబ్బర్ సింగ్ దేవీశ్రీ ఉర్రూతలూగించే ‘కెవ్వుకేక’ సంగీతం, ‘నేను ట్రెండ్ ని ఫాలోఅవ్వను - ట్రెండ్ సెట్ చేస్తా’ లాంటి మాటల తూటాలు, బొమ్మల అమ్మాయిగా శృతి ‘అందాలు’, ‘నాకునేనే పోటీ - నాతోనాకే పోటీ’ అంటూ పవర్ స్టార్ తన అద్భుతమైన  ప్రధర్శనతో అభిమానులకు విందు భోజనం పెట్టిన తీరు... కలగలిపి,  2012 సంవత్సరంలో ‘గబ్బర్ సింగ్’ తన జోరు చూపించి ఉత్తమ చిత్రంగా ఎన్నికయ్యాడు. నిజానికి ‘గబ్బర్ సింగ్’ రీమేక్ చిత్రమే అయినా,  ప్రేక్షకులను వినోదంతో అలరించిన తీరు, తెలుగు నేటివిటీ కోసం  దర్శకుడు ‘హరీష్ శంకర్’ చేసిన కృషి ఈ సినిమాను ఉత్తమ చిత్రం గా ఎన్నుకోవడానికి కారణమయ్యాయి.      బిజినెస్ మ్యాన్ ఈ సర్వేలో బిజినెస్ మ్యాన్ సినిమా రెండవ ఉత్తమ సినిమాగా ఎన్నిక కావడం మారుతున్న తెలుగు ప్రేక్షకుల అభిరుచిని తెలియ చేస్తుంది. పూరీ జగన్నాథ్ రూపొందించిన బిజినెస్ మ్యాన్ సినిమా ‘క్రైమ్ కూడా ఓ వ్యాపారమే’ అనే నేపథ్యంతో తెరకెక్కింది. అయితే ఆ చిత్రంలో మహేష్  హీరో పాత్ర పోషించడంతో సినిమాకు కొత్త అందం వచ్చింది. బిజినెస్ మ్యాన్  చిత్రం రెండవ ఉత్తమ చిత్రంగా ఎన్నికయ్యింది.

మరింత సమాచారం తెలుసుకోండి: