లక్సరియస్ వెహికల్స్ లో ప్రాధాన్యత పొందిన ఆడి నుండి మరో కొత్త రకం ఎస్.యు.వి వెహికల్ రిలీజ్ కు సిద్ధమైంది. ఆడి క్యూ5 జనవరి 18న ఇండియన్ మార్కెట్ లోకి రిలీజ్ అవుతుంది. ఈ వెహికల్ ఇంటీరియస్ ఇంకా ఎక్స్ టీరియర్ విభాగంలో ఎన్నో మార్పులను చోటు చేసుకుంది. అవుట్ గోయింగ్ మోడల్ ఫ్రెంట్ డిజైన్ తో వస్తున్న ఈ వెహికల్ ఫ్లాట్ ఫాం మాత్రం క్యూ 7 మోడల్ లా తయారు చేయబడింది.


ఇక ఆడి క్యూ5 మునుపటి మోడల్ తో పోల్చితే ఫుల్లీ అప్డేటెడ్ వెహికల్ గా వస్తుండటమే కాకుండా ఇదవరకు వెహికల్ కన్నా 100 కిలోల వెయిట్ తక్కువగా వస్తుంది. ఇక టెక్నికల్ విషయానికొస్తే 195 బిహెచ్పి పవర్.. 400 ఎన్.ఎం టార్క్ తో వస్తున్న ఈ వెహికల్ 2 లీటర్ డీజిల్ ఇంజిన్ తో అందుబాటులో వస్తుంది. 252 బిహెచ్పి తో 2 లీటర్ డీజిల్ ఇంజిన్ కూడా త్వరలో మార్కెట్ లోకి రాబోతుంది. 8 ఆటోమెటిక్ ట్రాన్స్ మిషన్స్ అందుబాటులో ఉన్న ఈ వెహికల్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టెం తో రానుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: