యమహా నుండి వచ్చిన ఎఫ్.జెడ్ వెహికల్ యువత మనసులు గెలిచిన సంగతి తెలిసిందే. యమహాలో బాగా క్లిక్ అయిన మోడల్ ఎఫ్.జెడ్.. ఇక ఈ మోడల్ నుండి ఎఫ్.జెడ్-ఎస్ కూడా మార్కెట్ లోకి వచ్చింది. ఎఫ్.జెడ్ మోడల్ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యమహా ఎఫ్.జెడ్ నుండి కొత్త మోడల్ రిలీజ్ చేశారు. అదే ఎఫ్.జెడ్-ఎస్ ఎఫ్.ఐ.


ఎఫ్.జెడ్ ప్రియుల ఆలోచనలకు తగ్గట్టుగా ఈ సరికొత్త మోడల్ తయారు చేయబడింది. 86,042 రూపాయల ఎక్స్ షోరూం ప్రైజ్ తో ఈ వెహికల్ అందుబాటులోకి రానుంది. అర్మడా బ్లూ కలర్ లో రిలీజ్ అయిన ఈ బైక్ ఎఫ్.జెడ్ బైక్ ఉన్న ఫీచర్స్ అన్నిటితో పాటుగా అదనపు అధునాతన ఫీచర్స్ తో వస్తుంది. 


కొత్త అప్డేట్స్ తో వచ్చిన ఈ ఎఫ్.జెడ్-ఎస్ ఎఫ్.ఐ కచ్చితంగా ప్రస్తుతం ఉన్న అన్ని స్పోర్ట్స్ బైక్ మోడల్స్ కు గట్టి పోటీ ఇస్తుందని చెప్పొచ్చు. యమహా రెగ్యులర్ కస్టమర్స్ కు ఈ ఎఫ్.జెడ్ కొత్త వర్షన్ మాత్రం బాగా నచ్చేస్తుందని అంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం కొత్త బైక్ కొనే ఆలోచన ఉన్న వారు దగ్గరలో ఉన్న యమహా షోరూంకు వెళ్లి ఈ కొత్త బైక్ వివరాలు తెలుసుకోండి.



మరింత సమాచారం తెలుసుకోండి: