దక్షిణ భారత అగ్రగామి ద్విచక్ర వాహన సంస్థ అయిన టివిఎస్ నుండి సరికొత్త మోడల్ బైక్ రిలీజ్ అవుతుంది. టివిఎస్ రేడియాన్ 110 సిసి బైక్ ప్రవేశపెట్టింది. 110 సిసి కెపాసిటీతో ఈ బైకులు వస్తున్నాయి. ఈ బైక్ ధర 48,400 ఎక్స్ షో రూం ప్రైజ్ తో వస్తున్నాయి. టివిఎస్ రేడియాన్ సరికొత్త ఫీచర్స్ తో అందుబాటులోకి వస్తుంది.


ఇంజిన్, మైలేజ్, డిజైన్ అంతా ఇదవరకు టివిఎస్ బైకులతో పోలి ఉన్నా కొంత మార్పులతో ఈ బైక్ వస్తుంది. టివిఎస్ రేడియాన్ చాలా సింపుల్ లుక్ తో వస్తున్నాయి. ఎల్.ఈ.డి లైట్స్ తో ఈ బైక్ అందుబాటులోకి వస్తుంది. 109.77 సిసి కెపాసిటీ సామర్ధ్యంతో వస్తున్న ఈ బైక్ 4 స్పీడ్ గేర్ బాక్స్ తో 7000 ఆర్.పి.ఎం ఇంజిన్ వేగం తో 8.2 బిహెచ్పి పవర్ ఇస్తుంది. 


అంతేకాదు 5000 ఆర్పిఎం వద్ద 8.7 ఎన్.ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక దీని ట్యాంక్ 10 లీటర్ల పెట్రోల్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. గంటకు 69.3 కిలోమీటర్ల మైలేజ్ తో ఈ బైక్ వస్తుంది. 110 సిసి సెగ్మెంట్స్ లో మైలేజ్ బైక్ గా టివిఎస్ రేడియాన్ తీసుకునే అవకాశం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: